»   » నేను ఆంటీని కాదు.. అగ్లీ అంతకంటే కాదు.. లైవ్‌లో అనసూయ ఫైర్

నేను ఆంటీని కాదు.. అగ్లీ అంతకంటే కాదు.. లైవ్‌లో అనసూయ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫేస్‌బుక్‌లో లైవ్ ద్వారా అభిమానులకు చేరువ అవుదామని ఉత్సాహంతో వచ్చిన యాంకర్, నటి అనసూయకు ఇటీవల కాలంలో చేదు అనుభవాలు ఎక్కువగానే ఎదురవుతున్నాయి. అర్జున్‌ రెడ్డి చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన అనసూయకు ఇటీవల మరో నెటిజన్లు షాకిచ్చారు. తనపై ప్రత్యక్ష్యంగా కామెంట్ చేసిన నెటిజన్లపై కాసేపు విరుచుకుపడింది. ఆ తర్వాత లైవ్‌లో ఉన్నామని తెలుసుకొని ఆమె కాస్త శాంతించింది. లైవ్‌లో ఏమి జరిగిందంటే..

ఖుషీగా కబుర్లు

ఖుషీగా కబుర్లు

చాలా రోజుల తర్వాత లైవ్‌లోకి వస్తున్నాను. అభిమానులతో కాసేపు ఖుషీగా కబుర్లు చెప్పాలనుకొంటున్నాను. ఏంటీ సంగతులు, ఎలా ఉన్నారు.. ఏమిటీ విశేషాలు అంటూ లైవ్‌లో నెటిజన్లను పలుకరించింది. ఆ సమయంలో ఓ అభిమాని అనసూయపై చేసిన కామెంట్ ఆమెకు కోపం తెప్పించాయి. ఆ కోపానికి కారణమైన కామెంట్ ఏమిటంటే..

అగ్లీగా ఉన్నావు..

అగ్లీగా ఉన్నావు..

అనసూయతో ఓ నెటిజన్ మాట్లాడుతూ.. మేకప్ లేకుండా చాలా అగ్లీ (చెండాలం)గా కనిపిస్తున్నావు అని కామెంట్ చేశాడు. దాంతో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. అసహనంతో ఊగిపోయింది. ఏదో అభిమానులతో హ్యాపీగా మాట్లాడుదామని వస్తే నీవు ఇలా మాట్లాడుతావా అని నిలదీసింది.

గంటల సేపు నిరీక్షించే..

గంటల సేపు నిరీక్షించే..

గతంలో సినీ తారలను చూడటానికి వాళ్ల ఇంటి వద్ద గంటల సేపు నిరీక్షించేవారు. వారు కారులో వెళ్తుంటేనో.. లేదా ఇంటి ముందు కనిపిస్తే చాలా అభిమానులు చాలా సంతోషపడేవారు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినీ యాక్టర్లు అభిమానులకు మరింత చేరువయ్యారు. అలాంటి నేపథ్యంలో మీ ముందుకు వచ్చిన వారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫైర్ బ్రాండ్‌గా

ఫైర్ బ్రాండ్‌గా

ఇలా అనసూయ ఫైర్ బ్రాండ్‌ అవతారమెత్తిన సమయంలోనే మరో వ్యక్తి రంగస్థలంలో నీ పాత్ర ఏమిటీ అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా ఆ పాత్ర ఏంటో నేను ఇప్పుడే చెప్పను. కానీ చాలా కీలకమైన పాత్ర. ప్రస్తుతం నేను ఆ పాత్ర గురించి చెబితే దర్శక, నిర్మాతలు ఊరుకోరు అని చెప్పుకొంటూ వెళ్లింది. ఆ సమయంలోనే మరో వ్యక్తి ‘మీరు రాంచరణ్‌కు మేనత్తగా నటిస్తున్నారటగా?‘ అని ఝలక్ ఇచ్చాడు.

కంగుతిన్న అనసూయ

కంగుతిన్న అనసూయ

అభిమాని ప్రశ్నతో కంగుతిన్న అనసూయ ‘నేను రాంచరణ్‌కు మేనత్తగా నటించడం లేదు. నా ఆంటీ (వయసు మీరిన) పాత్ర అంతకంటే కాదు. కానీ నాది స్పెషల్ రోల్. దానిని తెర మీద చూడాల్సిందే అని అనసూయ కవరింగ్ ఇచ్చింది.

అర్జున్ రెడ్డి వివాదంలో..

అర్జున్ రెడ్డి వివాదంలో..

అర్జున్ రెడ్డి చిత్రం చాలా అసభ్యంగా ఉంది అంటూ ఆ చిత్రంలో కొన్ని సీన్లపై అనసూయ అభ్యంతర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో డిబేట్‌లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో కొందరు సినీ అభిమానులు అనసూయను సోషల్ మీడియాలో రఫ్ ఆడిన సంగతి తెలిసిందే.

English summary
Anchor Anasuya has been trolled by netizens recetimes on Arjun Reddy movie. The star anchor once again get shock from the fans again. one of the netizens called her Ugly. He said your are looking ugly without makeup.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu