హాట్ టాపిక్: అంజలిని కంట్రోల్ చేస్తున్న నిర్మాత

ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న ఆ తెలుగు పెద్ద నిర్మాత ఆమె డేట్స్ చూస్తూండటమే ఆమె కెరీర్ ముందుకు వెళ్లకపోవటానికి కారణం అంటున్నారు. ఆమె డేట్స్ కోసం సంప్రదిస్తే ఆ నిర్మాతను అడగమంటోందని, దాంతో చాలా మంది నిర్మాతలు...వేరే నిర్మాతను డేట్స్ కోసం అడగటమేంటని, అడిగినా రెమ్యునేషన్ బేరం అడగలేమని వెనక్కి తగ్గారు. రీసెంట్ గా మంచి విజయం సాధించిన చిత్రంలో ఓ పెద్ద చిత్రంలో సైతం ఆమెను అడిగారు. అయితే అప్పుడూ ఇదే సమస్య ఎదురై ఆమె ఆఫర్ వేరే ముంబై హీరోయిన్ కి వెళ్లిపోయింది. తెలుగు హీరోయిన్ కదా అని నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపించినా ఆ నిర్మాత వలన ఆమె డేట్స్ కు ఎవరూ వెళ్లటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
ఇక తమిళంలోనూ ఆమె పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ మధ్యన మురుగదాస్ నిర్మాతగా మారి నిర్మించిన 'వట్టికుచ్చి' లో అంజలి నటించింది. మురుగదాస్ శిష్యుడు పి.కిన్‌స్లివ్ దర్శకత్వం వహించారు. మురుగదాస్ సోదరుడు దిలీపస్ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం 'ప్రాణం కోసం' అనే పేరుతో అనువదించారు. అయితే ఆ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంజలి ఇలా కెరీర్ ని పాడుచేసుకుంటోందంటున్నారు.


Click it and Unblock the Notifications











