»   »  రాజశేఖర్ ని భరించలేక పరారైందా

రాజశేఖర్ ని భరించలేక పరారైందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్స్ విషయంలో రాజశేఖర్ మీద మొదటి నుంచీ నెగిటివ్ రిమార్కులే ఉన్నాయి. అందులోనూ గతంలో గోదావరి హీరోయిన్ నీతు చంద్ర...రాజశేఖర్ తనను బాగా ఇబ్బందిపెట్టాడని, బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చి ఇక ఏ హీరోయిన్ ఇటు వైపు చూడకుండా విజయవంతంగా చేయగలిగింది. అయితే ఆఫర్స్ రానీ బాలీవుడ్ బ్యాచ్ అప్పుడప్పుడూ రాజశేఖర్ వైపు చూస్తూనే ఉన్నారు. ఆ మధ్యన పవన్ తో పంజా చిత్రంలో చేసిన అంజలి లవానియా తర్వాత ఏ ఆఫరూ సంపాదించలేకపోయింది. దాంతో రాజశేఖర్ ప్రక్కన చేయటానికి ఓకే అంది.

అయితే ఊహించని విధంగా గడ్డం గ్యాంగ్ లోంచి ఆమె సీన్ నుంచి మిస్సైంది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతున్న దాన్ని బట్టి ఆమెతో మొదటి షెడ్యూల్ మొదలెట్టారని,రాజశేఖర్ ని భరించలేక పరారైందని అంటున్నారు. అయితే ఇది రాజశేఖర్ అంటే గిట్టనివారు పుట్టించిన రూమర్ అని, ఆమె తనంతట ఈ ప్రాజెక్టు నుంచి నిష్కమించిందని కొందరంటున్నారు. ఏదైమైనా రాజశేఖర్ వెంటనే మరో హీరోయిన్ షీలా తో నటిస్తున్నానంటూ మీడియా ముందుకు వచ్చి స్టిల్స్ రిలీజ్ చేసారు. అది చూసిన వాళ్లు ఈ లేటు వయస్సులో ఈ ఘాటు రొమాన్స్ చేసినందుకే విరక్తి పుట్టి అంజలి జంప్ అయ్యింటుంది అంటున్నారు.

Anjali lavania Exit from rajasekhar Geddam Gang

తమిళంలో విజయం సాధించిన 'సూదుకవ్వుమ్‌'కిది రీమేక్‌. జీవితా రాజశేఖర్‌ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఫొటోలు విడుదల చేసారున

రాజశేఖర్‌ మాట్లాడుతూ.... ''గడ్డం దాస్‌ అనే వ్యక్తి జీవితంలో జరిగే మలుపులే ఈ చిత్రం. ఇందులో నాతో పాటు మరో నలుగురు యువ నటులు చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లోకెల్లా ఇది వైవిధ్యంగా ఉంటుంది'' అన్నారు. జీవిత మాట్లాడుతూ ... ''సూదుకవ్వుమ్‌' సినిమాను తెలుగులో చాలా మంది చేద్దామనుకున్నారు. ఆఖరికి ఆ అవకాశం మాకు దక్కింది. 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ''తొలి సన్నివేశం నుంచి కొత్తదనం కూడుకున్న కథ ఇది. రాజశేఖర్‌ నటన, షీనా అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు దర్శకుడు. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. చిత్రానికి ఛాయాగ్రహణం: డేమిల్‌ గ్జావియర్‌ ఎడ్వర్డ్స్‌, సంగీతం: అచ్చు. కళ: వెంకట్‌, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ కెవిన్‌

English summary

 
 Rajashekar recently drew flak for posing with the actress of the film, Sheena Shahabadi, who appeared like his daughter next to him. Sheena was replaced in the nth hour after the original choice - Anjali Lavania of ‘Panjaa’ fame - opted out of ‘Gaddam Gang’ film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu