»   »  చివరకు కమెడియన్‌కు కమిటైన అంజలి!

చివరకు కమెడియన్‌కు కమిటైన అంజలి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో వచ్చిన పలు చిత్రాల్లో తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసాడు కమెడియన్ శ్రీనివాసరెడ్డి. కమెడియన్లు ఏదో ఒక సందర్భంలో హీరో అవతారం ఎత్తడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అదే దారిలో శ్రీనివాసరెడ్డి కూడా ప్రయాణిస్తున్నాడని, ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందంటూ ఫిల్మ్ నగర్ టాక్.

ఎంవివి సినిమా బేనర్లో, ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ లేక పోయినా....ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త మాత్రం ఇపుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. శ్రీనివాసరెడ్డి సరసన నటించడానికి హీరోయిన్ అంజలి గ్నీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Anjali to Romance with Comedian Srinvasa Reddy?

ఇంతకు ముందు ఈ చిత్రంలో త్రిష నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్రిష కంటే ముందే పివిపి సంస్థ వారు అంజలిని సంప్రదించారని, అయితే అప్పుడు అంజలి నో చెప్పిందని సమాచారం. పరిస్థితులు తలక్రిందులై చేతిలో సినిమాలేవీ లేకుండా ఖాళీగా ఉన్న అంజలి అప్పుడు తిరిస్కరించిన ఆఫర్నే చేయడానికి ఒప్పుకుందని సమాచారం. ఈ వార్తలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

మరి ఈ వార్తలపై హీరోయిన్ అంజలి ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా...ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఇతర విషయాలపై ఇంకా కచ్చితమైన సమాచారం లభించడం లేదు. త్వరలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary
Film Nagar source said that, PVP banner is planning to do a movie introducing comedian Srinivas Reddy as hero. Interestingly, heroine of South India agreed to pair up with Srinivas Reddy. It is really surprising to see Anjali accepting this offer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu