»   » రామ్ చరణ్ తో మరో మల్టిస్టారర్...డిటేల్స్

రామ్ చరణ్ తో మరో మల్టిస్టారర్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఇప్పుడు మల్టిస్టారర్స్ టైమ్ నడుస్తోంది. ఆ ట్రెండ్ ని అనుసరిస్తూ రామ్ చరణ్ ..ఎవడు చిత్రం చేస్తున్నారు. అయితే అందులో అల్లు అర్జున్ చిన్న పాత్రలో మాత్రమే కనిపించనున్నారు. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ మరో మల్టిస్టారర్ కి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఈ సారి వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ డైరక్ట్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఆ కథ ఇంతకు ముందు...నాగచైతన్య,నాగార్జున, అక్కినేనిలతో కృష్ణ వంశీ చేద్దామనుకున్న కథే అని చెప్పుకుంటున్నారు.

మరో ప్రక్క తెలుగులో నాగ చైతన్య-సునీల్ మల్టీ స్టారర్‌గా రూపొందిన 'తడాఖా' చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈచిత్రాన్ని బాలీవుడ్లో సంయుక్తంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

బాలీవుడ్ వెర్షన్లో నాగ చైతన్య పాత్రకు షాహిద్ కపూర్‌ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ....ఇంకా ఈ విషయం ఫైనల్ కాలేదని అంటున్నారు. నాగ చైతన్య పాత్రకు రామ్ చరణ్‌ను తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జంజీర్ సినిమాలో రామ్ చరణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలు చేయడంతో కరణ్ జోహార్ దృష్టి రామ్ చరణ్‌పై పడినట్లు బాలీవుడ్ టాక్.


ఇది కాకుండా .. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భారీ చిత్రం జంజీర్. ఈ చిత్రాన్ని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న ఈచిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ హిందీ జంజీర్ చిత్రంతోనే అమితాబ్ బచ్చన్‌కు యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ చలన చిత్ర జీవితంలోనే జంజీర్ ప్రత్యేక చిత్రం. దానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్న తుఫాన్ చిత్రం కూడా టాలీవుడ్‌లో రికార్డుల ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఇటీవలే రామ్ చరణ్‌ను అమితాబ్ పొగడ్తలతో ముంచెత్తారు. 'రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడని నమ్ముతున్నా' అని ప్రశంసించారు.

ఎవడు చిత్రం అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. దిల్ రాజు మాట్లాడుతూ...-'' 'ఎవడు' ని రైట్ టైమ్ చూసి విడుదల చేస్తాం. అఫీషియల్ ప్రెస్ నోట్ ఇస్తాం. ఈ లోగా విడుదల తేదీ విషయంలో ఏ విధమైన ఊహాగానాలు చేయవద్దని మీడియాని కోరుతున్నాను అన్నారు. అలాగే రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం'' అని చెప్పారు.

English summary
Bandla Ganesh wants to make a Multi Starrer with Ram Charan. Apparently, director Krishna Vamsi has readied a script and he will be handling the project. The actors in question are Superstar Krishna, Victory Venkatesh and Mega Power Star Ram Charan..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu