For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో మరో RRR: దగ్గుబాటి రానాతో క్రియేటివ్ డైరెక్టర్ ప్లాన్.. బాహుబలి తర్వాత ఇదే.!

  By Manoj
  |

  టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కుమారుడిగా సినీ రంగంలోకి ప్రవేశించాడు రానా దగ్గుబాటి. కెరీర్ ఆరంభంలో పలు పరాజయాలు పలుకరించినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందలేదు. అదే సమయంలో మరిన్ని చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే హిందీలోకి కూడా అడుగు పెట్టాడు. కానీ, రానాకు రెండు ఇండస్ట్రీల్లో అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు. ఇక, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఈ యంగ్ హీరో కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం అతడు పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రానాతో ఓ డైరెక్టర్ అదిరిపోయే ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఏంటా కథ.?

  ఆ సినిమానే నిలబెట్టింది.. ఫేమస్ చేసింది

  ఆ సినిమానే నిలబెట్టింది.. ఫేమస్ చేసింది

  రానా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ అతడికి హిట్ మాత్రం దక్కలేదు. అయితే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి'తో మాత్రం రానాకు భారీ విజయం దక్కింది. అంతేకాదు, అతడి పేరు కూడా దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ సినిమా తర్వాత రానాకు ఎన్నో హిట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే అతడి మార్కెట్ కూడా పెరిగిపోయింది.

   రానాకు ఆ హీరోయిన్‌తో లవ్ ట్రాక్

  రానాకు ఆ హీరోయిన్‌తో లవ్ ట్రాక్

  దగ్గుబాటి హీరో రానా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. అదే సమయంలో అతడిపై కొన్ని రూమర్లు కూడా ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా అతడు ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడన్న వార్తలు కలకలం రేపాయి. అంతేకాదు, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో అతడు ఇంకా పాపులర్ అయిపోయాడు.

  రానాకు జబ్బు చేసింది.. అందుకే ఇలా.!

  రానాకు జబ్బు చేసింది.. అందుకే ఇలా.!

  ఈ మధ్య దగ్గుబాటి రానా బాగా సన్నబడ్డాడు. దీంతో అతడికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని ప్రచారం జరిగింది. కొందరైతే ఈ దగ్గుబాటి వారి అబ్బాయికి కిడ్నీ సమస్య వచ్చిందని, అందుకే బక్క పల్చగా అయిపోయాడని కూడా చెప్పుకున్నారు. అంతేకాదు, కిడ్నీ మార్పిడి కోసం అమెరికాలో చాలా రోజులు ఉన్నాడని అన్నారు. తర్వాత ఈ వార్తలను అతడు ఖండించిన విషయం తెలిసిందే.

  యంగ్ హీరో వల్లు ఆగిపోయిన సినిమాలు

  యంగ్ హీరో వల్లు ఆగిపోయిన సినిమాలు

  రానాకు ఏమైందన్న దానిపై క్లారిటీ అయితే లేదు కానీ.. అతడి గైర్హాజరు వల్ల చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ముఖ్యంగా రానా హీరోగా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ‘హాతీ మేరీ సాతీ'తో పాటు సాయి పల్లవితో కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం' ఆగిపోయాయి. చాలా రోజుల గ్యాప్ అనంతరం ఈ సినిమా షూటింగులలో అతడు పాల్గొనబోతున్నాడు.

  టాలీవుడ్‌లో మరో RRR.. డైరెక్టర్ ప్లాన్

  టాలీవుడ్‌లో మరో RRR.. డైరెక్టర్ ప్లాన్

  దగ్గుబాటి రానా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ తేజ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్‌ స్టోరీతో వస్తుందట. ఇందులో రానా విలన్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. అందుకే ఈ మూవీకి ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం.

  Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
  బాహుబలి తర్వాత ఇదే.. మామూలుగా ఉండదట

  బాహుబలి తర్వాత ఇదే.. మామూలుగా ఉండదట

  రానా గతంలో ‘బాహుబలి' సినిమాలో విలన్‌గా నటించాడు. దీని తర్వాత ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు'లో మరోసారి ప్రతినాయక పాత్రను పోషించబోతున్నాడు. ఈ పాత్ర చాలా కౄరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు తేజ. వాస్తవానికి ఆయన ఆర్టికల్ 370 మీద సినిమా అనుకున్నాడు. అది వర్కౌట్ కాకపోవడంతో దీనిని పట్టాలెక్కించబోతున్నాడని అంటున్నారు.

  English summary
  DescriptionRamanaidu "Rana" Daggubati, is an Indian actor, producer, television personality, visual effects co-ordinator, and an entrepreneur known primarily for his work in Telugu language films, as well as his works in Hindi and Tamil language films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X