»   »  మహానటున్ని మళ్ళీ బతికిస్తున్నారు, నమో వేంకటేశాయ లో అక్కినేని 3 నిమిషాల పాత్ర

మహానటున్ని మళ్ళీ బతికిస్తున్నారు, నమో వేంకటేశాయ లో అక్కినేని 3 నిమిషాల పాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా అంటేనే ఓ క్రేజ్. దానికి తోడు, అది భక్తిరస చిత్రం అంటే మరింత క్రేజు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి కూడా బిజినెస్ సర్కిల్స్ లో అలాంటి క్రేజే ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి చిత్రాలు ఘనవిజయాలు సాధించడంతో ఇప్పుడీ చిత్రం హాట్ కేకులా వుంది.

నిర్మాణంలో ఉండగానే ఆయా ఏరియాలకు బిజినెస్ జరిగిపోతోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయినట్టు సమాచారం. ఒక ప్రముఖ పంపిణీ సంస్థ ఈ హక్కులను 6 కోట్లకు సొంతం చేసుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు నమో వేంకటేశాయ లో మరో అద్బుతం చోటుచేసుకోబోతోంది. అదేమిటంటే దివంగత నటులు అక్కినేని నాగేశ్వర రావ్వు గారి తో ఒక పాత్రని నమో వేంకటేశాయ లో చూపించ బోతున్నారు అదెలా అంటే...


నాగేశ్వరరావు సలహాలను

నాగేశ్వరరావు సలహాలను


ఓ పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు: ఇప్పటి వరకూ నాగార్జున నటించిన భక్తి చిత్రాలలో నాగేశ్వరరావు సలహాలను రాఘవేంద్రరావు తీసుకునేవారు. అక్కినేని నాగేశ్వరారావు సైతం నాగార్జునతో శ్రీ రామదాసు మూవీలో కనిపించి అభిమానులను అలరించారు. అంతేకాకుండా తన పాత్రకి న్యాయం చేశారు కూడ. అలాగే నాగార్జున నటిస్తున్న ఓం నమో వేంకటేశాయ మూవీలోనూ ఓ పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావుని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది.


 నాగ భరణం

నాగ భరణం


ఇప్పటికే దివంగత కన్నడ హీరో విష్ణువర్థన్ తో కోడి రామ కృష్ణ అయితే ఏకంగా ఒక సినిమానే తీసారు. నాగ రహవు పేరుతో కన్నడ లో వచ్చిన ఆసినిమా తెలుగులో కూడా నాగ భరణం పేరుతో రానుంది. ఎటూ గ్రాఫిక్స్ తో అద్బుతాలు చేయటానికి అలవాటు పడిపోయిన కోడి అక్కడ ఒక సూపర్ స్టార్ ని మళ్ళీ భతికించినట్టే... ఇక్కడ కూడా ఆనాటి అందాల నటున్ని మరోసారి ఇలా చూసు కోవటం ఆనందమే కదా.


 3 నిముషాల పాటు

3 నిముషాల పాటు


అయితే ప్రస్తుతం ఇది అసాధ్యం కాబట్టి...నాగాశ్వరరావు పాత్రని 3 నిముషాలకి కుదించి, ఆ పాత్రని యానిమేషన్ తో క్రియేట్ చేయనున్నారు. తాజాగా గ్రీన్ మ్యాట్ లో దీనికి సంబంధించిన సన్నివేశాన్ని దర్శకేంద్రుడు చిత్రీకరించాడంటూ ఇండస్ట్రీలో న్యూస్ వినిపిస్తుంది. మొత్తంగా నాగార్జున నటించనున్నఈ ఓం నమో వేంకటేశాయ చిత్రం అందరి ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగార్జున మరోవైపు ఈ భక్తి చిత్రం పూర్తయిన వెంటనే మరో కమర్షియల్ చిత్రంని స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.


 ఇంకా స్సష్టత రావాల్సి ఉంది

ఇంకా స్సష్టత రావాల్సి ఉంది


తను చేయబోతున్న అప్ కమింగ్ కమర్షియల్ చిత్రం యొక్క కథని ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్టుగా ఇండస్ట్రీ నుండి తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన డైరెక్టర్ ఎవరు? అనేదానిపై మాత్రం ఇంకా స్సష్టత రావాల్సి ఉంది. మరోవైపు తన తనయుల మూవీలకి సంబంధించిన పూర్తి బాధ్యతని సైతం నాగార్జున తీసుకోవటంతో...ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పనుల్లో నాగార్జున ఫుల్ బిజిగా ఉన్నాడు. ముఖ్యంగా అక్కినేని అఖిల్ ని రీ లాంచింగ్ చేసేందుకు నాగార్జున భారీ ప్రణాళిక వేసుకున్న సంగతి తెలిసిందే.


 అనుష్క‌, ప్రగ్యా జైస్వాల్

అనుష్క‌, ప్రగ్యా జైస్వాల్


అనుష్క‌, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కీల‌క పాత్రలను పోషిస్తున్నారు. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన భక్తి చిత్రాలు అనూహ్యమైన విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరనుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.


English summary
An interesting buzz is that Late akkineni Nageshwara rao will appear in Nagarjuna And K Raghavendra Rao's Om Namo Venkatesaya Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu