ఎట్టకేలకు అనుపమకు మరో బంపరాఫర్.. కేరళ బ్యూటీకి మరో చాన్స్ ఇచ్చిన దిల్ రాజు
అనుపమా పరమేశ్వరణ్‌కు అందం ఎక్కువ.. అదృష్టం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నా.. ఒక్క విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోతోంది. చీరకడితే పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే ఈ అమ్మడికి కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క సోలో బ్లాక్ బస్టర్ హిట్ లేదు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేసిన రెండు చిత్రాలు (ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే) మోస్తరుగా ఆడాయి. ఈ రెండింటిలో అనుపమా లుక్స్‌కు, అప్పీయరెన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి కానీ మరో సినిమా మాత్రం రాలేదు. ఇటీవలె రాక్షసుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా.. ఆమెకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఇలాంటి స్థితిలో అనుపమకు మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

గతంలో 'దిల్'రాజు బ్యానర్లో 'శతమానం భవతి' చేసిన అనుపమ, మరోసారి ఆయన బ్యానర్లో చేయనుంది. 'దిల్' రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడైన ఆశిష్ ను హీరోగా పరిచయం చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను ఆయన పూర్తి చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుపమను తీసుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారట.


Click it and Unblock the Notifications











