బాహుబలి-2: అనుష్కతో రాజమౌళికి తలనొప్పి, వార్నింగ్?
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' చిత్రం గతేడాది విడుదలైన సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్లింది. రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసిన ఈచిత్రం ఇండియన్ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన బెస్ట్ విజువల్ వండర్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.
దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 ఈ సినిమాను విడుదల చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసారు. అంతా బాగానే జరుగుతున్నా ఓ విషయంలో మాత్రం రాజమౌళికి తలనొప్పి తరయారైందని, అందుకు కారణం హీరోయిన్ అనుష్క అనే ప్రచారం జరుగుతోంది.
బాహుబలి-2లో అనుష్కకు సంబంధించిన 'దేవసేన' పార్ట్ చాలా కీలకంగా ఉండబోతోంది. అయితే ఇప్పటికీ ఈ పార్ట్ చిత్రీకరణ పూర్తికాలేదు. అందుకు కారణం పాత్రకు తగిన విధంగా అనుష్క బరువు తగ్గకపోవడమే అని అంటున్నారు.
గతేడాది బాహుబలి తర్వాత అనుష్క 'సైజ్ జీరో' చిత్రం కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో బాహుబలి-2 సినిమాలోని దేవ సేన పాత్ర కోసం బరువు తగ్గాల్సిన పరిస్థితి. ఆమె అనుకున్నంత వేగంగా బరువు తగ్గడం లేదని, దీంతో షూటింగ్ మరింత లేటయ్యే ప్రమాదం ఉందని, ఈ ఎఫెక్ట్ సినిమా మొత్తం మీద పడుతుందని రాజమౌళి మదనపడుతున్నాడని టాక్.

వార్నింగ్
బరువు తగ్గే విషయమై అనుష్కకు రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడని టాక్.

షూటింగ్ మొత్తం
అనుకన్న సమయానికి షూటింగుకు సిద్ధం కాక పోతే ఆ ఎఫెక్ట్ సినిమా మొత్తం మీద పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఎక్స్ పర్ట్
డైట్, ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ సమక్షంలో అనుష్క బరువు తగ్గేందుకు కఠినంగా ప్రయత్నాలు చేస్తోంది.

తప్పు చేసామే..
బాహుబలి పార్ట్ 2 పూర్తయ్యే వరకు అనుష్క వేరే సినిమాల్లో నటించకుండా షరతు పెడితే బావుండేదని, అలా చేయకుండా తప్పుచేసామని రాజమౌళి ఇపుడు ఫీలవుతున్నాడని అంటున్నారు.

పార్ట్ 2
రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కట్టప్ప
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలసుకోవడానికైనా చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

రిలీజ్
పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. బాహుబలి-2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. బాహుబలి రెండో పార్ట్ 2017, ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











