»   » డాన్స్ మాస్టర్ రివేంజ్ నుంచి తప్పించుకున్న అనుష్క!

డాన్స్ మాస్టర్ రివేంజ్ నుంచి తప్పించుకున్న అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

డాన్స్ మాస్టర్ నుంచి దర్శకత్వం వైపు టర్న్ అయిన రాఘవ లారెన్స్ ఇటీవల కాంచన పేరుతో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో లారెన్స్ సరసన లక్ష్మిరాయ్ నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది కూడా. వాస్తవానికి ఈ సినిమాలో లారెన్స్ తొలుత అనుష్కను హీరోయిన్ గా తీసుకుందామనుకున్నాడు. అయితే పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో అనుష్క నో చెప్పింది. తన ఆఫర్‌ను కాదన్న అనుష్కపై పగ పెంచుకున్న అరెన్స్ ఎప్పటికైనా ఆమె తన చేతికి దొరక్క పోద్దా అని ఎదురు చూస్తూన్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

ఇదే సమయంలో లారెన్స్ కు ప్రభాస్ హీరోగా 'రెబల్" సినిమా దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్కను భావించారు. ప్రభాస్ కు అనుష్క మంచి జోడీ కావడంతో పాటు, తన రివేంజ్ ను కూడా తీసుకోవచ్చని ఆలోచనలో ఆమెను హీరోయిన్ సెలక్ట్ చేసేందుకు ఓకే అన్నాడట లారెన్స్. అయితే....ఇప్పడు ప్రభాస్ సరసన అనుష్క కాకుండా తమన్నాకన్ఫర్మ్ అయింది.

అసలు ఈ గంధరగోళం ఏమిటీ..? అని ఆరా తీస్తే, కాంచన సినిమాలో తన ఆఫర్ కాదన్నందుకే అనుష్కను లారెన్స్ కావాలని తప్పించాడని కొందరంటుంటే....లారెన్స్ విషయం ముందే పసిగట్టిన అనుష్క అతని రివేంజ్ కు బలికాకుండా ముందుగానే తఃప్పుకుందని మరి కొందరంటున్నారు. ఏది ఏమైతేనేం? అరెన్స్ రివేంజ్ కు బలికాకుండా అనుష్క సేఫ్ గా పక్కకు తప్పకుందని, ఇదంతా ఆమె మంచి కే జరిగిందని అనుష్క సన్నిహితులంటున్నారు.

English summary
Lawrence tortured Anushka in all possible ways to make her work. Finally, with the intervention of a big hero, Anushka walked out of the project leaving Prabhas dejected. Surely, this is a positive sign for her as she has escaped the revenge drama of Lawrence miraculously, an industry insider added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu