»   »  సింగపూర్ లో ఆడియో ఫంక్షన్...అనుష్క కు తప్పదు

సింగపూర్ లో ఆడియో ఫంక్షన్...అనుష్క కు తప్పదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాధారణంగా తెలుగు సినిమా ఆడియో పంక్షన్స్ హైదరాబాద్ లో జరుగుతూంటాయి. అయితే ఈ మధ్య వేరే రాష్ట్రం ఏర్పడటంతో విజయవాడలో సైతం ఫంక్షన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సింగపూర్ లో ఆడియో పంక్షన్ చేయాలని ఓ చిత్రం టీమ్ భావిస్తోంది. అది మరేదో కాదు..అనుష్క ప్రధాన పాత్రలో చేస్తున్న ‘జీరో సైజ్' టీమ్. గత రెండు నెలలలుగా కంటిన్యూగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని చిత్రం టీమ్ భావిస్తోంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆడియోని మలేషియా లేదా సింగపూర్ లో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు, తమిళ వారికి రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఈచిత్రాన్ని సైతం విభిన్నంగా ప్రమోట్ చెయ్యడం కోసం అక్కడ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ మంచి వెన్యూ కోసం చూస్తున్నారు. వెన్యూ ఫిక్స్ అవ్వగానే ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫైనలైజ్ చేసి ప్రకటిస్తారు. ఈ నెల నే ఆడియో రిలీజ్ ఉండే అవకాశం ఉంది.

Anushka's Size Zero audio at singapore

ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.

ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఆర్యా, భరత్, ఉర్వసీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.

English summary
The team of Anushka's Size Zero is planning to hold the audio function either in Singapore or Malaysia to attract huge Indian gathering there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu