»   » ప్రభాస్‌తో తేల్చలేదు.. కానీ చిరంజీవికి దగ్గరవుతున్న అనుష్క..

ప్రభాస్‌తో తేల్చలేదు.. కానీ చిరంజీవికి దగ్గరవుతున్న అనుష్క..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతున్న అనుష్కకు దక్షిణది నుంచే కాదు.. బాలీవుడ్ నుంచి కూడా భారీగా ఆఫర్లు వస్తున్నాయి. బాహుబలి తర్వాత ఖిలాడీ అక్షయ్ కుమార్ అనుష్కకు ఫ్యాన్సీ అఫర్ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారం జరిగింది. అలాగే సాహోలో ప్రభాస్ పక్కన మళ్లీ జతకడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం ప్రయత్నించిన సాహో నిర్మాతలు మళ్లీ అనుష్కకే ఓటు వేసినట్టు ఓ రూమర్ వైరల్ అవుతున్నది. ఇదిలా ఓ పక్కగా జోరుగా ప్రచారం అవుతుండగానే తాజాగా మరో సెన్సేషనల్ వార్త వెలుగులోకి వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చిత్రంలో అనుష్క నటించనున్నారనే న్యూస్ ఐటెమ్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నది.

గతంలో చిరు పక్కన అనుష్క

గతంలో చిరు పక్కన అనుష్క

గతంలో ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన స్టాలిన్ చిత్రంలో చిరంజీవి ప్రక్కన అనుష్క కనిపించింది. ఓ ప్రత్యేక పాటలో డాన్స్ చేసి ఆకట్టుకొన్నది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం, అనుష్క దక్షిణాదిలో బిజీగా మారడంతో వారి కాంబినేషన్ కుదర్లేదు. ఇటీవల ఖైదీ నంబర్ 150 సినిమా సమయంలో అనుష్క బాహుబలి చిత్రంతో బిజీగా ఉంది. డేట్స్ సమస్య తలెత్తడంతో వీలుకాలేదు. ప్రస్తుతం బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

సాహోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని జేజమ్మ

సాహోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని జేజమ్మ

సాహో‌లో ప్రభాస్ పక్కన అవకాశం ఉన్నప్పటికీ.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని తాజా సమాచారం. ఇంట్లో పెళ్లి గురించి జోరుగా ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమాలు ఒప్పుకోవాలా లేదా అనే సందిగ్ధంలో అనుష్క ఉన్నట్టు గాసిప్స్ వెలువడుతున్నాయి. అందుకే ప్రభాస్‌కు ఓకే చెప్పనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో హీరోయిన్ లేకుండానే ప్రభాస్ తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించేశాడు కూడా.

ఉయ్యాలవాడ చిత్రంలో..

ఉయ్యాలవాడ చిత్రంలో..

ఖైదీ నంబర్150 తర్వాత చారిత్రాత్మక చిత్రం ఉయ్యాలవాడ నర్సింహరెడ్డిలో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. 1847 ఫిబ్రవరి 22న రాయలసీమ ప్రాంతంలో ఉరితీయబడిన స్వాతంత్ర పోరాటయోధుడి కథా నేపథ్యంగా మెగాస్టార్‌ను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు తనయుడు రాంచరణ్ నిర్మాతగా మారుతున్నాడు. ఈ చిత్రం కోసం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

అనుష్క, ప్రియాంకతో సంప్రదింపులు

అనుష్క, ప్రియాంకతో సంప్రదింపులు

ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ఓ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌ని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మిగితా ఇద్దరు ముద్దుగమ్మల కోసం అనుష్క, ప్రియాంకలను సంప్రదించినట్టు తెలుస్తున్నది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లాంటి చారిత్రక సినిమాలలో నటించిన అనుభవం అనుష్కకు ఉంది. ఇది సినిమాకు ప్లస్ అవుతుందనే మాట వినిపిస్తున్నది.

ప్రియాంక అయితే..

ప్రియాంక అయితే..

ఐశ్యర్యతో పాటు మరో హీరోయిన్‌ పాత్రకు ప్రియాంక చోప్రాను తీసుకుంటే సినిమాకు ఇంటర్నేషనల్‌ లుక్‌ వస్తుందనే భావనలో మెగా ఫ్యామిలీ ఉన్నదట. వీళ్లతోపాటు లింగ చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా నటించిన సోనాక్షి సిన్హా పేరు కూడా పరిశీలనలో ఉందట! ఇలా క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకొనే ఎవరు దక్కించుకొంటారో వేచి చూడాల్సిందే.

English summary
After Baahubali2 success, Anushka Shetty has established a strong fanbase even in the Bollywood. As per reports, megastar Chiranjeevi, who is teaming with Surender Reddy, is likely to romance Anushka Shetty. Anushka Shetty has previously played a guest appearance in a song in Chiranjeevi-AR Murugadoss's Stalin.There are rumours that in this movie Ishwarya Rai Bachchan also acting beside mega star. There are other names like Priyanka Chopra, Sonakshi Sinha names under consideration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu