»   » అనుష్క ప్రత్యేక పాత్రలో....నాగ్ ఒప్పించాడు

అనుష్క ప్రత్యేక పాత్రలో....నాగ్ ఒప్పించాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క త్వరలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి మురిపించనున్నదని తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు నాగార్జున, కార్తి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఆమెను ఎంచుకున్నారని వినికిడి. ఈ చిత్రంలో అతిథి పాత్ర కోసం...ఓ తెలిసున్న ఫేస్ కోసం వెతికి, ఆమెను ఎంపిక చేసారంటున్నారు.నాగార్జున ఫోన్ చేసి ఒప్పించాడని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగార్జున - తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా తెలియజేశారు. ‘మున్నా', ‘బృందావనం', ‘ఎవడు' చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.

ప్రసతుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకే ఒక హీరోయిన్ ఉంటుందని అంటున్నారు. కానీ ఇద్దరిలో ఒకరికే హీరోయిన్ ఉంటుందా లేక ఇద్దరు హీరోలు కలిసి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. భారీ చిత్రాల నిర్మాత పరమ్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Anushka special in Nag-Karti multi starrer

హీరోయిన్ ప్రాధాన్యమున్న కథల్లో నటించి ఆకట్టుకోవడంలో అనుష్క తర్వాతే ఎవరైనా. ఆ విషయంలో ఎంతోమంది హీరోయిన్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది స్వీటీ. అయితే కథల కోసమని ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడంలాంటివేమీ చేయనని చెబుతోంది అనుష్క.

''కథని కథగా చూస్తాను తప్ప... ఇది కథానాయిక ప్రాధాన్యంతో కూడుకొన్నదా, కాదా? అని ఆరా తీయను. ఒక నటిగా ఎలాంటి కథలొచ్చినా చేయడానికి సిద్ధమే'' అని చెప్పింది. బరువైన పాత్రల్లో చక్కగా ఒదిగిపోతుంటారు, అదెలా సాధ్యం? అని అడిగితే... 'అదంతా దర్శకుల చలవే' అంటోంది.

''దర్శకుడు స్క్రిప్ట్‌ రాసుకొనేటప్పుడే నటీనటులకి సంబంధించిన సగం పని పూర్తవుతుంటుంది. సెట్‌కి వెళ్లాక వారి ఆలోచనల్లో ఒదిగిపోవడమే మేం చేయాల్సింది. నేను ఆ పనినే కాస్త చిత్తశుద్ధితో చేస్తుంటాను తప్ప... నటన విషయంలో నా గొప్పతనం ఏమీ లేదు'' అని చెప్పుకొచ్చింది అనుష్క. త్వరలోనే ఆమె 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాలతో సందడి చేయబోతోంది. ప్రస్తుతం 'సైజ్‌జీరో'లో నటిస్తోంది.

English summary
Anushka will be seen in a special role in Nagarjuna, Karthi multi starrer film directed by Vamsi Paidipally .
Please Wait while comments are loading...