twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టికెట్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అయితే అక్కడే కొత్త అనుమానం.. అసలు ఏమైందంటే?

    |

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మొత్తం 1, 000 సినిమా హాళ్లలో దాదాపు 185 సినిమా హాళ్లు మూతపడటంతో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లు అకస్మాత్తుగా మూతపడే పరిస్థితి కొనసాగుతోంది. తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఏపీలో సినిమా టికెట్ల ధరల పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఉంటారు.

    AP government forms a Committee to sort out Ticket Prices Issue

    థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలు ఈ కమిటీ నిర్ధారించనుంది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. పది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కమిటీలో పేర్లను నామినేట్ చేయాలని ప్రభుత్వం కోరడం గురించి నిన్న ప్రెస్ మీట్ లో రోజు దిల్ రాజు ప్రస్తావించారు. ఇదిలా ఉండగా ఈ కమిటీ పై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో కొంత ఆశ్చర్యం నెలకొంది. ఈ కమిటీలో సినీగోయర్స్ అసోసియేషన్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధులు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ సంఘం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

    ఎందుకంటే ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా టిక్కెట్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేసే సంఘం ఇదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుడుగా చెప్పబడుతున్న ఆల్ హీరోస్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ప్రభుత్వ చర్యలు గట్టిగా సమర్ధిస్తున్నాడు. ఈ అసోసియేషన్ కూడా అలాంటిదేనా అని ఇండస్ట్రీ వారు అనుమానిస్తున్నారు. కమిటీ సభ్యులు మరియు ఇతర వివరాలు అందుబాటులో ఉన్నప్పుడు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    ఇక మంగళవారం నాడు ఏపీ సెక్రటేరియట్ లో సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి పేర్ని నాని మావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సినిమా థియేటర్‌లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు చేయడం ధర్మం కాదని పేర్కొన్న ఆయన ''చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే వ్యత్యాసం ఈ ప్రభుత్వానికి లేదు. చట్టం, నిబంధనలకు లోబడి పనిచేసుకుంటూ వెళ్తాం అని అన్నారు.

    అయితే పేర్ని నాని మంచి సినిమా తీశాడని పన్ను మినహాయింపులు ఏమీ ఇవ్వరన్న ఆయన గత ప్రభుత్వ హయాంలో ఇలా జరిగిందని, బామ్మర్ది గారు తీస్తే, ఒక విధంగా, తీయకపోతే మరొక రకంగా ఉండేదని, చారిత్రాత్మక సినిమా వాళ్ల బామ్మర్ది గారు తీస్తే పన్ను మినహాయింపు ఇచ్చారు. చిరంజీవి గారు తీస్తే అడిగినా ఇవ్వలేదన్నారు. ఇక టికెట్‌ రేట్ల విషయమై 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మాత దానయ్యగారు ఒకట్రెండుసార్లు ఫోను చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పామని, ఇప్పుడు కమిటీ వచ్చింది కాబట్టి, వారి దృష్టి తీసుకెళ్తాం'' అని మంత్రి పేర్ని నాని అన్నారు.

    English summary
    AP government forms a Committee to sort out Ticket Prices Issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X