»   » తెలుగు స్టార్ హీరోయిన్ కి మినిస్టర్ కాస్టలీ కారు గిప్ట్

తెలుగు స్టార్ హీరోయిన్ కి మినిస్టర్ కాస్టలీ కారు గిప్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత రెండు రోజులుగా తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్కకి ఓ మంత్రి మెర్సిడన్ బెంజ్ కారు గిప్ట్ గా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ కి చెందిన ఈ మంత్రితో ఆమెకు ఈ మధ్యనే పరిచయం జరిగిందని..ఇంతలోనే ఎప్పుడు ఆమె ఇంప్రెస్ చేసిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్నా ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అలాగే సెక్రటియేట్ లోనూ ఈ విషయం గురించి గుసగుసలు వినిపడుతున్నాయని సినీ వర్గాల భోగట్టా. ఇక మరో వర్గం ఇలా హీరోయిన్స్ కి మినిస్టర్స్,రాజకీయనాయకులు గిప్ట్ లు ఇవ్వటం కొత్తేమీ కాదని, అనుష్క మాత్రం అటువంటివాటికి దూరంగా ఉండే మనిషేనని చెప్తున్నారు. ఇంతకీ ఆ మినిస్టర్..రాష్ట్రంలో చాలా ముఖ్యమైన శాఖని నిర్వహిస్తున్న వ్యక్తి ని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అనుష్క..నాగార్జున సరసన రగడ చిత్రంలోనూ, మహేష్ సరసన ఖలేజా లోనూ, వెంకటేష్ సరసన చంద్రముఖి సీక్వెల్ లోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu