»   » పోస్టర్ హల్‌చల్: పవన్-దాసరి సినిమాకు....తమిళ స్టార్ డైరెక్టర్?

పోస్టర్ హల్‌చల్: పవన్-దాసరి సినిమాకు....తమిళ స్టార్ డైరెక్టర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణ రావు నిర్మాణ సారథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కు ‘కల్కి' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ పేరు కూడా ఖరారైదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు సంచలన సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్ కలసి సంగీతం సమకూర్చబోతున్నారని, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టరని, పీటర్ హెయిన్స్ ఫైట్స్ సమకూర్చబోతున్నాడని ప్రచారం జరిగిపోతోంది.

కొందరు అభిమానులు తమకు ఇప్పటి వరకు అందిన వివరాలతో ఓ పోస్టర్ కూడా తయారు చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేసారు. ‘కల్కి' అనే టైటిల్ చూస్తుంటే...ఈ పోస్టర్ చూస్తుంటే ఆయన గడ్డం పెంచేది ‘కల్కి' సినిమా కోసమే కాబోలు అనే సందేహం కలుగుతోంది.

AR Murugadoss confirmed for Pawan Kalyan-Dasari film?

దాసరి నారాయణ రావు మాత్రం పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ముఖ్యమైన విషయాలు ఏమీ బయట పెట్టలేదు. ఆగస్టులో సిసినిమా ప్రారంభిస్తామని మాత్రం ప్రకటించారు. దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు? టెక్నీషియన్లు ఎవరు అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేసారు.

ఆ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో...‘గబ్బర్ సింగ్-2' సినిమాకు రెడీ అవుతున్నారు. ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందిట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. పూనే దగ్గర పల్లెలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అంటుననారు. అయితే ఇది ఎంత వరకూ నిజం అనేది తెలియాలంటే షూటింగ్ ప్రారంభం కావాల్సిందే.

English summary
Ever since Dasari Narayana Rao announced that he is going to produce a film with Pawan Kalyan in the lead, there have been many speculations about who is going to direct the film. Film Nagar source said that, AR Murugadoss confirmed.
Please Wait while comments are loading...