»   » ఇద్దరు హీరోల భార్యలు కుమ్మేసుకొంటున్నారట.. అర్జున్ కపూర్‌తో మలైకా ‘కెవ్వుకేక’

ఇద్దరు హీరోల భార్యలు కుమ్మేసుకొంటున్నారట.. అర్జున్ కపూర్‌తో మలైకా ‘కెవ్వుకేక’

Posted By:
Subscribe to Filmibeat Telugu

గబ్బర్‌సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే ఐటెం సాంగ్‌తో సుపరిచితమైన మలైకా ఆరోరా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ వదిన. ఆమె సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు భార్య అన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత అభిప్రాయ బేధాల కారణంగా మలైకా, అర్భాజ్ ఖాన్‌ వేర్వేరు ఉంటున్నారు. అయితే ఖాన్ కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్‌కైనా హాజరవుతుంది. ఈమెకు సల్మాన్ మరో సోదరుడు సీమాకు ఏమాత్రం పడటం లేదనేది తాజాగా వెలుగు చూసింది.

మాల్దీవుల్లో అగ్గిరాజేసిన వివాదం..

మాల్దీవుల్లో అగ్గిరాజేసిన వివాదం..

సల్మాన్ సోదరి అర్పితఖాన్ కుమారుడి జన్మదిన వేడుకలు మాల్దీవులల్లో జరిగాయి. ఈ వేడుకల్లో సల్మాన్ కుటుంబం మొత్తం పాల్గొన్నది. ఇక్కడే సీమాఖాన్‌కు, మలైకా అరోరా ఖాన్‌కు మధ్య గొడవలు ఉన్నట్టు స్పష్టమైంది. మాల్దీవుల్లో అందరు కలిసి ఉన్నా వీరిద్దరూ ఒకరి కళ్లల్లోకి మరోకరు చూసుకోవడానికి ఇష్టపడలేదట. ఖాన్ కుటుంబ సభ్యులకూ దూరంగా తన పిల్లలతో కలిసి సమయాన్ని గడిపిందట. అందుకు కారణం మరోకటి ఉన్నదనే అంశం బయటకు వచ్చింది.

సీమా ఖాన్ ఆహ్వానం తిరస్కరణ

సీమా ఖాన్ ఆహ్వానం తిరస్కరణ

ఇటీవల సీమాఖాన్ బోటిక్‌లో కొత్త కలెక్షన్ చేర్చింది. అందుకోసం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మలైకాను ఆహ్వానించింది. అయితే ఆ కార్యక్రమానికి మలైకా హాజరుకాలేదు. కానీ ఆమె సోదరి అమృత అరోరా వెళ్లింది. తాను పిలిచినా రాకపోవడంపై మలైకాపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. అమృతతో ఈ విషయాన్ని చాలా చర్చించి సీరియస్‌గా తీసుకొన్నదనేది బాలీవుడ్ మీడియా సమాచారం.

కరణ్ జోహర్ పార్టీకి ..

కరణ్ జోహర్ పార్టీకి ..

అయితే తన కార్యక్రమానికి హాజరుకాకపోయినా సీమాఖాన్ సీరియస్‌గా తీసుకోకపోవునట. కానీ తన కార్యక్రమానికి రాకుండా కరణ్ జోహర్ బర్త్ డే పార్టీకి మలైకా వెళ్లడం ఆమె ఆగ్రహానికి తెప్పించిందనే అసలు కారణమని ఇటీవల బయటపడింది.

సల్మాన్ కుటుంబంతో అమృత అరోరాకు

సల్మాన్ కుటుంబంతో అమృత అరోరాకు

మలైకా ఆరోరా ఖాన్ సోదరి అమృతా అరోరా ఖాన్‌కు సల్మాన్ ఖాన్ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మాల్దీవుల్లో జరిగిన వేడుకలకు కూడా అమృత హాజరైంది. తన సోదరి అంటి ముట్టన్నట్టు ఉన్నా అమృత అందరితో కలిసిపోవడం చర్చనీయాంశమైంది.

అర్జున్ కపూర్‌తో మలైకా కెవ్వుకేక..

అర్జున్ కపూర్‌తో మలైకా కెవ్వుకేక..

అర్బాజ్, మలైకాలు వేరు కావడానికి కారణం అర్జున్ కపూర్ అనేది మరో పుకారు. అర్బాజ్‌కు దూరంగా ఉంటున్న మలైకా ప్రస్తుతం తన కుమారుడు అర్హాన్‌తో కలిసి వేరుగా ఉంటున్నది. భర్తకు దూరంగా ఉంటున్న మలైకా అరోరా ఖాన్ ఇటీవల కాలంలో శ్రీదేవి సవతి కుమారుడు, హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు తెగ షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కొద్దికాలంగా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.

కిమ్ శర్మ, సుసానే ఖాన్‌తో..

కిమ్ శర్మ, సుసానే ఖాన్‌తో..

ఏప్రిల్ 16 (ఆదివారం) బాలీవుడ్‌లో జరిగిన ఓ విందులో మలైకా, అర్జున్ కలిసి సమయాన్ని గడపడం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ పార్టీకి కిమ్ శర్మ, సుసానే ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీలో మలైకా హాట్ హట్ కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనది ఇన్‌సైడ్ టాక్.

English summary
Salman Khan's brother Arbhaz Khan's former wife Malaika Arora and Sohail Khan's wife Seema Khan reportedly can't see eye-to-eye. the two steered clear of each other during their recent trip to Maldives. Even during the family's holiday in Maldives Malaika was not seen much with the Khan family except a photo-op here and there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu