»   » మహేష్ లేదా రాంచరణ్.. ఆ దర్శకుడి ఛాయిస్ ఎవరు?

మహేష్ లేదా రాంచరణ్.. ఆ దర్శకుడి ఛాయిస్ ఎవరు?

Subscribe to Filmibeat Telugu

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. అర్జున్ రెడ్డి చిత్రం సృష్టించిన హంగామా అటువంటిది. అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా సరికొత్త ప్రేమ కథని సందీప్ వంగా ఆవిష్కరించాడు. అర్జున్ రెడ్డి చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అర్జున్ రెడ్డి చిత్ర ఘనవిజయం తరువాత సందీప్ వంగా పేరు మారుమ్రోగింది. హీరోలు ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

రాంచరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సందీప్ వంగాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన సందీప్ అటు రాంచరణ్, ఇటు మహేష్ బాబు ఇద్దరినీ కలసి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం విడుదలై విజయం సాధించింది. మహేష్ భరత్ అనే నేను కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.

Arjun Reddy director next movie details

ఈ నేపథ్యంలో సందీప్ వంగా తదుపరి చిత్రంపై మరో మారు చర్చ మొదలైంది. రాంచరణ్ బోయపాటితో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా రాజమౌళి దర్శకత్వంలో మూవీ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక మహేష్ బాబు వంశి పైడిపల్లి చిత్రంతో బిజీకాబోతున్నాడు.

రంగస్థలం చిత్ర సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సందీప్ కూడా కనిపించడం ఆసక్తిగా మారింది. మహేష్ లేదా రాంచరణ్ ఎవరితో సినిమా చేయాలన్నా సందీప్ కొంత కాలం వేచిచూడక తప్పేలా లేదు.

English summary
Arjun Reddy director next movie details. He wants to work with Mahesh and Ram Charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X