Arundathi Remake: అరుంధతి రీమేక్.. జేజమ్మ పాత్రలో నటించేది ఎవరంటే?
Arundathi Remake: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీని వేరే భాషలో రీమేక్ చేయడం లేదా వాటిని స్వీకెల్ లేదా ప్రిక్వెల్ మూవీ చేయడం. ఇప్పటికే ఎన్నో సినిమాలు మన భాషను పర భాషలోకి.. పర భాష నుంచి మన భాషలోకి రీమేక్ చేయబడ్డాయి. అయితే.. కొన్నికల్ట్ క్లాసిక్స్ ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే.. అలాంటి సాహసం చేసి బరీ డిజాస్టర్లను చవి చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగులో చాలా హిట్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి.. ఇంకొన్ని డిజాస్టర్స్ గా మారాయి. అయినా కూడా బాలీవుడ్ మాత్రం తెలుగు సినిమాలను రీమేక్ చేయడం ఆపడం లేదు.
సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు ఓ ట్రెండ్ సెట్ చేసి, తరతరాల తరబడి గుర్తుండిపోతాయి. అలాంటి లెజెండరీ సినిమాల్లో ఒకటే "అరుంధతి". లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన ఈ మిస్టికల్ ఫాంటసీ థ్రిల్లర్ 2009లో విడుదలై తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. దర్శకుడు కోడి రామకృష్ణ విజన్, సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు, అనుష్క నటన అన్నీ కలిసిపడి ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ హిట్ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ "అరుంధతి హిందీ రీమేక్" కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ రీమేక్‌కు దర్శకుడిగా "తని ఒరువన్", "గాడ్ ఫాదర్" ఫేమ్ మోహన్ రాజా ఎంపికైనట్టు సమాచారం. తెలుగులో లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు మోడర్న్ టచ్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హిందీలో రూపుదిద్దుకోబోతుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతోందని బజ్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కాగా, ప్రధాన తారాగణం ఫైనల్ దశలో ఉందట.
జేజమ్మ పాత్రలో శ్రీలీల!
తెలుగులో అనుష్క చేసిన "అరుంధతి"పాత్రలో ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్‌లో నటించబోతున్నది టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ స్టార్ శ్రీలీల. ఆమెను ఈ పాత్రకు సెట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. శ్రీలీల డ్యాన్సింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నందున, అనుష్క ఇమేజ్‌కి దగ్గరగా తీసుకురాగలమని ఫిల్మ్ యూనిట్ నమ్ముతుందని తెలుస్తోంది. అయితే, నెటిజన్ల నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ వస్తోంది. "అనుష్క జేజమ్మ పాత్ర అనేది ఒక లెజెండ్, దాన్ని ఎవ్వరూ రీ-క్రియేట్ చేయలేరు" అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు "శ్రీలీల యాక్టింగ్‌కి ఛాన్స్ ఇస్తే ఆమె కూడా సర్ప్రైజ్ చేయగలదు" అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పశుపతిగా సోను సూద్?
తెలుగులో "అరుంధతి" సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచింది పశుపతి పాత్ర. ఈ పాత్రలో నటించిన సోను సూద్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను భయపెట్టాడు. ఇప్పుడు హిందీ వెర్షన్‌లో కూడా అదే పాత్రను మళ్లీ సోను సూద్ చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన నెగటివ్ రోల్స్‌లో చూపిన ప్రావీణ్యం దృష్ట్యా ఈ కాస్టింగ్ సరిగ్గా కుదిరిందని సినీ వర్గాలు అంటున్నాయి.
అరుంధతి ఒక కల్ట్ క్లాసిక్
2009లో విడుదలైన 'అరుంధతి'బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అంతేకాకుండా, ఈ సినిమా 7 విభాగాలలో నంది అవార్డులు, అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది.
అరుంధతి ప్రత్యేకత ఏమిటంటే.. లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా, అది బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత అనుష్క కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
'అరుంధతిలాంటి సినిమాను రీమేక్ చేయడం అంటే రిస్క్! అసలు ఆ మేజిక్ రిపీట్ అవుతుందా?" అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం "టెక్నికల్‌గా బలమైన టీమ్‌తో చేస్తే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మళ్లీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది" అంటున్నారు. అంతేకాకుండా, శ్రీలీల యాక్టింగ్, ఎమోషనల్ డెప్త్, వాయిస్ మోడ్యులేషన్ లాంటివి కీలకం అవుతాయని అనలిస్టులు చెబుతున్నారు.
శ్రీలీల బిజీ షెడ్యూల్
ప్రస్తుతం శ్రీలీల చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ప్రధానంగా రవితేజ సరసన నటించిన "మాస్ జాతర" సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. అలాగే, మరికొన్ని టాలీవుడ్, కొలీవుడ్ ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఆమె "అరుంధతి రీమేక్"లో నటించడం బాలీవుడ్‌లో ఆమె డెబ్యూ కావచ్చని టాక్.


Click it and Unblock the Notifications











