»   » మణిరత్నం సినిమా నుండి స్టార్ హీరో వాకౌట్...!

మణిరత్నం సినిమా నుండి స్టార్ హీరో వాకౌట్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మణితర్నం అడిగితే కాదు, లేదు అని చెప్పకుండా ఏ తమిళ హీరో అయినా వెంటనే ఓకే చెప్పేస్తారు. అలాంటిది మణితర్నం కథ చెప్పిన తర్వాత కూడా విక్రమ్ ఆ సినిమాలో నటించలేనని చెప్పి తప్పుకున్నాడు. 'రావణ్" సినిమాతో మణికి బాగా క్లోజ్ అయిన విక్రమ్ ఇలా చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అసలు విక్రమ్ ఎందుకని మణిరత్నం మలి చిత్రం నుంచి వాకౌట్ చేశాడు? మణిరత్నం రాసుకున్న కథలో మొత్తం ముగ్గురు హీరోలుంటారు. ఒకటి మహేష్ బాబు, మరొకటి విజయ్ చేస్తుండగా మూడో పాత్ర విక్రమ్ కి ఆఫర్ చేశాడు. అయితే మహేష్ బాబు క్యారెక్టర్ నిడివి ఎక్కువ ఉండడంతో విక్రమ్ చిన్నబోయాడట. తనకి మహేష్ క్యారెక్టర్ ఇస్తే చేస్తానని చెప్పాడట. అయితే మహేష్ ని ఒప్పించడానికి ఆ క్యారెక్టరే ఆయుధంగా వాడుకున్న మణిరత్నం అందుకు ఒప్పుకోలేదట. దాంతో విక్రమ్ పోయి ఆ ప్లేస్ లో ఆర్య చేరాడు.

English summary
However, their talks fell apart because Vikram felt that his role was not juicy enough compared to the roles to be played by Vijay and Mahesh Babu. In the meantime, Arya who had no such qualms and was dying to work with Mani Ratnam met him personally and asked to be part of the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu