»   » చరణ్ తో 'జగదేకవీరుడు...' సీక్వెల్ ప్లానింగ్, ఆ సమస్య తీరగానే

చరణ్ తో 'జగదేకవీరుడు...' సీక్వెల్ ప్లానింగ్, ఆ సమస్య తీరగానే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాంతో ఆ చిత్రం సీక్వెల్ తయారు చేయాలంటూ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' సీక్వెల్ చేస్తారంటూ కొంతకాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రయత్నం ముమ్మరం చేసినట్లు సమాచారం.

అయితే దర్శకత్వం ఎవరు చేస్తారనేదే సమస్యగా మారిందని తెలుస్తోంది. రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఈ సబ్జెక్ట్ ని అంతే గొప్పగా డీల్ చేయగలని అశ్వనీదత్ నమ్ముతున్నారట. అయితే రాజమౌళి వరస ప్రాజెక్టుల నేపధ్యంలో వేరే దర్శకుడు కోసం తీవ్ర అన్వేషణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు ఖరారు చేసి ప్రకటన చేస్తారని తెలుస్తోంది.


గతంలో ఈ వార్త అధికారికంగా అశ్వనీదత్ స్పష్టం చేశారు. మాటీవీ వారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టారు నిర్మాత అశ్వినీదత్. రాఘవేంద్రరావు తమ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయనతో కలిసి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం రీమేక్ చేయాలని ఉందని వెల్లడించారు


Ashwini Dutt still planning sequel to JVAS

అశ్వినీదత్. ఇటు మెగా అభిమానులు కూడా 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' రీమేక్ కావాలని కోరుకుంటున్నారు. చేస్తేగీస్తే ఈచిత్రం రామ్ చరణ్ తేజ్ తప్ప మరొకరు చేసే అవకాశం లేదుకాబట్టి అశ్వినీదత్ ఆ ప్రకటన చేయగానే అభిమానులు సంబరపడిపోయారు. గతంలోనూ అశ్వినీదత్ ఈ ఇదే మాట అన్నారు కానీ ఆచరణకు నోచుకోలేదు. మరి అభిమానులు, అశ్వినీదత్ కోరుకుంటున్నట్లు ఆ విషయం నిజం అయ్యేది ఎప్పుడో వేచి చూడాల్సిందే.


ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్‌, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మీడియా హడావుడితో కూడిన వాతావరణం మధ్య రామ్‌చరణ్‌, అరవింద్‌ స్వామితో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.


ఈ చిత్రంలో శత్రువే తన బలంగా భావించే ఓ యువ ఐపీయస్‌ అధికారి పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఆయన తెరపై కనిపించే విధానం, హావభావాలు కొత్తగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


తమిళంలో విజయవంతమైన 'తని ఒరువన్‌'కి రీమేక్‌గానే తెరకెక్కుతున్నప్పటికీ, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కథలో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

English summary
Producer Ashwini Dutt is looking at making a sequel to this 'Jagadekaveerudu Atiloka Sundari'. And the producer wants Ram Charan to do the character of 'Jagadekaveerudu'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu