twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసురన్ రీమేక్‌లో వెంకటేష్.. క్రేజీ డైరెక్టర్ కన్ఫర్మ్!

    |

    ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన అసురన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతోన్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో ఈ రీమేక్‌కి సంబంధించిన ఇతర వివరాల పట్ల ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు.

    సరిగ్గా ఇలాంటి సమయంలో అసురన్ తెలుగు రీమేక్‌పై ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది ఎవరనే విషయం తెలిసింది. ఇటీవలే రాజు గారి గది 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన డైరెక్టర్ ఓంకార్ చేతిలో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దగ్గుబాటి సురేష్ బాబు, ఓంకార్ మధ్య చర్చలు కూడా నచ్చాయనేది టాక్.

    Asuran Telugu Remake.. Director Confirmed!

    తమిళంలో అసురన్ సినిమా వీక్షించిన ప్రతీ ఒక్కరూ జాతీయ అవార్డు రావాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. ఈ చిత్రంలో ధనుష్ నటనను అందరూ పొగిడేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ లు కూడా అసురన్ సినిమాపై, ధనుష్‌ నటనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల్చిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ సునామీ సృష్టించింది. దీంతో ధనుష్ కెరీర్‌లో ఆ ఫీట్‌ను సాధించిన మొదటి చిత్రంగా అసురన్ రికార్డులకెక్కింది.

    అంతటి సంచలనం సృష్టించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని తెలియడం, అది కూడా వెంకటేష్ హీరోగా రూపొందిస్తున్నారని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సామాజిక కోణాలను స్పృశించే అసురన్ లాంటి కథకు, వెంకీ నటన తోడైతే తెలుగులోనూ ప్రభంజనం సృష్టించడం ఖాయమే మరి.

    English summary
    Tamil Sensational movie Asuran Will remake on telugu. In this movie Daggubati Venkatesh selected as hero. Now from this movie director update came.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X