»   » ‘పల్నాడు’ లో ‘అత్తారింటికి దారేది ’ సీన్

‘పల్నాడు’ లో ‘అత్తారింటికి దారేది ’ సీన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అదేంటి విశాల్ తాజా చిత్రం 'పల్నాడు' లో సూపర్ హిట్ చిత్రం 'అత్తారింటికి దారేది ' ఉండటమేంటి..దానికి విజిల్స్ పడటం ఏంటీ అని డౌట్ పడుతున్నారా... అది నిజమే. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజైన రోజు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా డల్ గా నడుస్తున్న సమయంలోనూ జనం విజిల్స్ తో థియోటర్ మారు మ్రోగింది అంటే దానికి కారణం ఓ సన్నివేశంలో 'అత్తారింటికి దారేది ' ని చూపెట్టడమే.

'పల్నాడు' సెకండాఫ్ లో...విలన్ ...ఓ రాజకీయనాయకుడుని థియోటర్ లో కలుసుకునే సీన్ ఉంది. ఆ సీన్..జరిగే థియోటర్ లో...అత్తారింటికి దారేది చిత్రం ప్రదర్శింపబడుతూంటుంది. విలన్ ...పొలిటీషియన్ తో మాట్లాడేటప్పుడు... అత్తారింటికి దారేది సీన్స్... కనపడతాయి. అప్పటివరకూ డల్ గా ఉన్న థియోటర్ ఈ సీన్ తో ..పవన్ కనపించటంతో ఉషారు వచ్చింది.

పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ తొలిసారి విశాల్‌ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం 'పల్నాడు'. 'నా పేరు శివ' ఫేం సుశీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గజరాజు' ఫేం లక్ష్మీమీనన్‌ హీరోయిన్.

విశాల్‌ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్‌. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్‌ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్‌.

English summary
Tamil hero Vishal has come up with another movie, and is testing his luck again. His latest offering 'Palnadu' released today and the movie hasn't got the needed impact at box office as promisd by the young hero. But there is one wow moment in the movie, and it is none other than AD scene.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu