»   » అవసరాల శ్రీనివాస్...మామూలోడు కాదు...'సోగ్గాడు'

అవసరాల శ్రీనివాస్...మామూలోడు కాదు...'సోగ్గాడు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నటుడు నుంచి డైరక్టర్ గా మారిన అవసరాల శ్రీనివాస్.. ఈ సారి హీరోగా 'సోగ్గాడు' టైటిల్ తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ బాబు బాగా బిజీ. అయితే ఇదేమీ కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్టు ఏమీ కాదు..అల్రెడీ ఆయన చేస్తున్న హంటర్ రీమేక్ కు పెట్టిన టైటిల్ ఇది.

బాలీవుడ్ మూవీ హంటర్ తెలుగు రిమేక్ కి రంగం సిద్ధమైంది. హంటర్ తెలుగు రిమేక్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ వారు దక్కించుకొన్న విషయం తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఐరన్ మ్యాన్ 2, ది డావెన్సీ కోడ్, బాట్ మ్యాన్:ది డార్క్ నైట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు విఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టు గా పనిచేసిన నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

అవసరాల మాట్లాడుతూ...బాలీవుడ్‌ మూవీ హంటర్‌కు రీమేక్‌ సినిమాలో హీరోగా నటిస్తున్నాను. ఆ క్యారెక్టర్‌ చాలా బోల్డ్‌గా వుంటుంది. సెక్స్‌పాయింట్‌పై నడుస్తుంది. అందులో కంటెంట్‌ బాగా నచ్చింది. చాలామంది ఎందుకు చేస్తున్నావ్‌? అన్నారు. కానీ నాకు అందులో సెకండాఫ్‌లో ఏడుపువచ్చింది. అంత ఎమోషన్‌ వుంది. యాజ్‌టీజ్‌గా కథ వుండదు. కాస్త మారుతుంది అని చెప్పుకొచ్చారు.

Avasarala Srinivas to turn 'Soggadu' Now!

ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్‌ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడు.

నైజాంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూట్ సంస్థ అయిన అభిషేక్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తూండటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కామెడీ పాత్రల్లో మెప్పించిన శ్రీనివాస్‌ ఇప్పుడు సెక్స్‌ సైకోగా కనిపించనున్నాడు. మరి ఈ పాత్రతో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.

హిందీలో విడుదలైన సమయంలోనే 'హంటర్' చిత్రంలో బూతు కంటెంట్ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. సినిమాలోని కొన్ని పచ్చి బూతు సీన్లు, సెక్స్ సీన్లు అప్పట్లో సినిమాలో నుండి సెన్సార్ బోర్డు వారు తీసేసారు కూడా. అయినప్పటకీ అందులో కంటెంట్ అసభ్యంగానే ఉందని టాక్ వచ్చింది. మరి తెలుగులో ఇలాంటి కంటెంటును రీమేక్ చేసే క్రమంలో ఏమైనా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

English summary
Avasarala will be seen as a hero in the Telugu remake of Hindi movie "Hunterr" where the hero is a sex addict. Latest reports reveal that they have come up with the title 'Soggadu' with a caption - 'Baabu..Baga Busy'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu