twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిస్తున్న ఎన్టీఆర్ 'బాద్‌షా' బడ్జెట్

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 55 కోట్లు దాటిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ట్రేడ్ లో ఈ చిత్రానికి ఏ రేంజిలో బిజినెస్ జరగనుందనే విషయంపై చర్చలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేసినా, శ్రీను వైట్ల కాంబినేషన్ కాబట్టి నష్టముండదు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ నాగార్జున సాగర్ లో జరుగుతోంది.

    ఇక ఆ మధ్య. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. దీంట్లో ఎన్టీఆర్‌ కొత్త తరహా కేశాలంకరణతో, ఫ్రెంచ్‌ గెడ్డంతో కనిపిస్తున్నారు. యాక్షన్‌ అంశాలకు పెద్దపీట వేసినట్లు అర్థమవుతుంది. 'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' అనే డైలాగ్‌ పలికారు ఎన్టీఆర్‌. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత.

    ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్... సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

    ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు.

    English summary
    Currently ‘Baadshah’ climax sequences of the film are being canned at Nagarjuna Sagar. The film is directed by Srinu Vytla and produced by Bandla Ganesh. It is heard that the budget of the film has already touched Rs 55 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X