»   »  'బాహుబలి -2': కరుణ్ జోహార్ ప్రెజర్...అందుకే ఆ నిర్ణయం?

'బాహుబలి -2': కరుణ్ జోహార్ ప్రెజర్...అందుకే ఆ నిర్ణయం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ముంబై మీడియా ఓ వార్తను ప్రచారం చేస్తోంది. హిందీ వెర్షన్ ని ప్రమోట్ చేసిన కరుణ్ జోహార్ ఈ సెకండ్ పార్ట్ విషయంలో రాజమౌళి పై చాలా ప్రెజర్ తెస్తున్నారని.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇంతకీ ఏంటా ప్రెజర్ అంటే...నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి...సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోమని చెప్తునానారట. అంతేకాదు...రాజమౌళి ఏ ఆర్టిస్టులను అయితే అడుగుతారో వారిని ఖచ్చితంగా తీసుకువస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఎంతవరకూ నార్త్ ఫేస్ లు మనకు ఇక్కడ సౌత్ లో వర్కవుట్ అవుతారనేది కూడా డిస్కస్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


Baahubali 2 may have Bollywood flavor?

'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.


టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

English summary
Buzz is Karan Johar buoyed by the success of the first part requested Rajamouli to create characters for Bollywood stars so that it will have even wider reach in North.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu