»   » బాహుబలి2 సినిమా సీన్లు ఇంటర్నెట్‌లో లీక్.. ఖండించిన నిర్మాత శోభూ

బాహుబలి2 సినిమా సీన్లు ఇంటర్నెట్‌లో లీక్.. ఖండించిన నిర్మాత శోభూ

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం అనేక రకాలుగా వార్తల్లో నిలుస్తున్నది. ఈ చిత్రాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమాలోని కొన్ని సీన్లు ముందే ఇంటర్నెట్‌, సోషల్ మీడియాలో లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించిన చిత్రాలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అయితే ఈ వార్తను నిర్మాత శోభూ యార్లగడ్డ ఖండించారు.

ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం

ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం

బాహుబలిలో చిత్రంలో ప్రభాస్ రానాకు సంబంధించిన కొన్ని సీన్లు ఇటీవల ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇవి బాహుబలి2 సినిమాలోని కొన్ని సీన్లు అంటూ ప్రచారం చేశారు. ప్రభాస్ అనుష్క యుద్ధానికి సన్నద్థమవుతున్నట్టు ఉన్న చిత్రాలు వీడియోలో కనిపించాయి. రిలీజ్‌కు ముందే సీన్లు బయటకు ఎలా వచ్చాయని, నిర్మాతలు, ప్రభాస్ అభిమానులు కంగారు పడ్డారు. వాటి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

సెన్సార్ బోర్డు అధికారులకు

సెన్సార్ బోర్డు అధికారులకు

గత కొద్దిరోజులుగా పలు దేశాల్లోని సెన్సార్ బోర్డు అధికారులకు ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ సందర్భంగా ఎవరో ఒకరు సినిమాలోని కొన్ని సన్నివేశాలను కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటారనే విషయం నిర్మాతల దృష్టికి వచ్చింది.

నిర్మాత శోభూ ట్విట్టర్‌లో

నిర్మాత శోభూ ట్విట్టర్‌లో

సీన్ల వ్యవహారంపై స్పష్టమైన సమాచారం అందగానే నిర్మాత శోభూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాహుబలి2 సినిమా సీన్లు లీక్ కాలేదని ఆయన వివరణ ఇచ్చారు. వివిధ దేశాల్లోని సెన్సార్ బోర్డుల కార్యాలయంలో తప్ప మరెక్కడా బాహుబలి2ను ఇంతవరకు ప్రదర్శించలేదు అని శోభూ ట్వీట్ చేశారు. గతంలో కూడా బాహుబలి1 సినిమాకు సంబంధించిన కొన్ని నిమిషాల వీడియో ఫుటేజీ లీక్ కావడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

సినిమా చరిత్రలో ఇంతకు

సినిమా చరిత్రలో ఇంతకు

భారతీయ సినిమా చరిత్రలో ఇంతకు ముందేన్నడూ లేని విధంగా తెరకెక్కిన బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేల థియేటర్లలో విడుదల కానున్నది. ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో రూ.1000 కోట్లు సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

English summary
reports suggest that a video from Baahubali 2 has been leaked on the internet.According to a reports, the leaked video was from a preview show, which went viral on various social media platforms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu