»   » ‘బాహుబలి 2’ వార్ సీక్వెన్స్ ఫుటేజ్ లీక్, అంతా షాక్, సైబర్ క్రైమ్ గా కేసు

‘బాహుబలి 2’ వార్ సీక్వెన్స్ ఫుటేజ్ లీక్, అంతా షాక్, సైబర్ క్రైమ్ గా కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: భారీ చిత్రాలు షూటింగ్ లో ఉండగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీక్ వీరుల నుంచి కాపాడలేకపోతున్నారు. సినిమా లో మెయిన్ ఫుటేజ్ లు బయిటకు వస్తే అంతంత డబ్బు, శ్రమ ఖర్చు పెట్టిన దర్శక,నిర్మాత,నటులుకు ఎంత కష్టం అని ఆలోచించటం లేదు. సినిమాలో క్లిప్ లీక్ అయ్యిందా చూసేసి పండగ చేసుకుందాం అన్నట్లు ఉంటున్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన చిత్రం 'బాహుబలి'. దీనికి సీక్వెల్ గా వస్తోంది 'బాహుబలి 2'. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన రెండు నిముషాల ఇరవై సెకండ్స్ వార్ సీక్వెన్స్ క్లిప్ ఒకటి బయిటకు వచ్చిందని తెలుస్తోంది.


ఇక ఈ వార్ సీక్వెన్స్ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేసిందని సమాచారం. దాంతో ఈ వీడియోని చూసిన చాలా మంది అద్బుతం, అమోఘం అని ట్వీట్స్ చేయటం, అక్కడ నుంచి అసలా వీడియో ఎక్కడ ఉందా అని జనం ట్విట్టర్ లో వెతకటం మొదలైంది. అయితే ఈ వీడియోని ఇప్పుడు బాహుబలి టీమ్ డిలేట్ చేయిందని తెలుస్తోంది.


Baahubali 2 War Sequence Footage leaked

ఇక ఈ వీడియో క్లిప్, ఓ రా ఫుటేజ్ అని, ఎడిటింగ్, డి ఐ గట్రా చేయని, కెమెరా లో షూట్ చేసిన వార్ సీక్వెన్స్ అని చెప్తున్నారు. అందులో అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య వచ్చే సీన్స్ తో కలిపి ఈ ఫుటేజ్ బయిటకువచ్చింది. ఈ వీడియో చూసిన వాళ్లు ట్విట్టర్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ అదరకొట్టాడని, అనుష్క అదిరిపోయిందంటూ కామెంట్స్ చేసారు.


ఇక బాహుబలి 2 కి చెందిన డిజిటల్ టీమ్ ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసిందని తెలుస్తోంది. ఎక్కడ నుంచి ఈ వీడియో మొదలైందో తెలుసుకునే ప్రయత్నాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. అంటే త్వరలోనే ఆ లీక్ వీరులు ఎవరనేది తెలియనుంది. ఏదైమైనా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టం. గతంలోనూ బాహుబలి చిత్రం వార్ సీక్వెన్స్ లీక్ అయ్యి, పెద్ద వివాదం జరిగింది.


తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ భారీ వసూళ్లతో పాటు, టెక్నాలజీ పరంగా కూడా ప్రాంతీయ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపించింది.


ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న 'బాహుబలి 2' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేట్రికల్‌, శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తంలోఇప్పటికే అమ్ముడు పోయాయి.

English summary
A 2.20 minute action footage of Baahubali 2 leaked out and made rounds on Twitter, before it was deleted. The digital team of Baahubali 2 already filed a complaint with cyber-crime and trying their best to put the leaked video down from everywhere.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu