Kattappa: కట్టప్ప ఎవరు? బాహుబలి ప్రీక్వెల్ స్టోరీ ఇదేనా?

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ఇండియా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలు బ్లాక్‌బస్టరే. ఆయన సినిమాలు ఎప్పుడూ హై విజువల్స్, వినూత్న కథనంతో ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారు. అలా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశాయి. అలాంటి భారీ బస్టర్ మూవీస్ లో బాహుబలి సిరీస్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి రెండు పార్ట్‌లుగా విడుదలై.. ఎన్నో రికార్డులను తిరగరాసింది. కేవలంప్రేక్షకుల నుండే కాకుండా క్రిటిక్స్‌ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

అలాంటి బాహుబలికి తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది బాహుబలి. అయితే.. సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రతి పాత్ర ప్రత్యేకం. బాహుబలి, భల్లాల దేవ, దేవసేన పాత్రలతో పాటు, కట్టప్ప కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయి గుర్తింపును సంపాదించుకుంది. బాహుబలి మొదటి పార్ట్‌లో "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?" అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.

Baahubali Kattappa Character to Get a Spin Off Film by Vijayendra Prasad Rajamouli

తాజాగా కట్టప్ప పాత్ర ఆధారంగా ప్రత్యేక సినిమాను రూపొందించడానికి రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మహిష్మతి రాజ్యానికి కట్టుబడి, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా రాజ్యాన్ని రక్షించడానికి అహర్నిశలు కృషి చేసే వ్యక్తి కట్టప్ప. ఈ సినిమాలో కట్టప్పకు సంబంధించిన పూర్తి చరిత్ర, కుటుంబ నేపథ్యం, మాహిష్మతి సామ్రాజ్యంలో అతని కట్టుబాటు, ఎందుకు ఒక నమ్మిన బానిసగా ఉండాల్సి వచ్చింది అనే అంశాలను వివరించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కథ పూర్తయి, సెట్స్‌పై త్వరలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. ఈ ప్రాజెక్ట్ ప్రీ-విజువలైజేషన్ వర్క్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అలాగే.. సెట్ డిజైన్స్, కస్ట్యూమ్స్, పాత్రల రూపకల్పన వంటి కీలక అంశాలు రూపొందించబడుతున్నట్లు టాక్. అయితే, ఈ సినిమాకు రాజమౌళి స్వయంగా దర్శకత్వం వహిస్తారా? లేక వేరే దర్శకుడితో ఈ ప్రాజెక్ట్ కొనసాగించబడుతుందో అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. బాహుబలి లో కట్టప్ప పాత్రకు వచ్చిన ఆదరణ దృష్టిలో ఉంచుకుని, రాజమౌళి అలాంటి ఒక పాత్రతో సినిమా చేయాలని భావించడం ఫ్యాన్స్ కోసం హైప్ సృష్టించింది.

బాహుబలి సినిమా లవర్స్, ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కొత్త కట్టప్ప సినిమాకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా కట్టప్ప సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించగలదని భావిస్తున్నారు. రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ స్టైల్‌లో తెరకెక్కితే, తెలుగు సినిమా పరిశ్రమలో మరో సెన్సేషన్ మరో అవకాశం ఉంది.త్వరలో ఈ సినిమా సంబంధిత పూర్తి వివరాలు, రిలీజ్ షెడ్యూల్ వివరాలు మీడియా ముందుకు రానుందని వర్గాలు చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: bahubali kattappa ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X