»   » పవన్ కల్యాణ్ కోసం దిమ్మతిరిగే కథ.. విజయేంద్ర ప్రసాద్ కసరత్తు..

పవన్ కల్యాణ్ కోసం దిమ్మతిరిగే కథ.. విజయేంద్ర ప్రసాద్ కసరత్తు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ చూసిన ప్రేక్షకుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ సీన్‌లో ఉండే ఎమోషన్స్, పవర్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఈ సీన్ చూసిన ప్రతీ ఒక్కరు ఏమి తీశాడురా రాజమౌళి అని ముక్కున వేలేసుకొన్నారు. రాజమౌళి ప్రతిభను కీర్తించని వారులేరంటే అతిశయోక్తి కాదేమో. ఆ సీన్ అంత గొప్పగా రావడానికి కారణం పవన్ కల్యాణ్ స్ఫూర్తి అని బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ అని చెప్పగానే ప్రేక్షకులు మరోసారి థ్రిల్ అయ్యారు. తాజాగా పవన్ కోసం విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

పవన్ స్ఫూర్తిగా..

పవన్ స్ఫూర్తిగా..

ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఆలోచిస్తుంటే ఓ ఆడియో ఫంక్షన్‌లో పవర్ స్టార్ లేకుండానే అభిమానులు చేసిన హడావిడి ఆ సీన్ కారణమని, పవన్ కల్యాణ్ కోసం అభిమానులు ఎంతకైనా తెగిస్తారు.. ప్రేమను కురిపిస్తారు అనేది ఆ సీన్ ద్వారా స్పష్టమైంది. అదే సన్నివేశాన్ని ఆధారంగా తీసుకొని బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ చిత్రీకరించామని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

పవర్ స్టార్ అంటే ఇష్టం..

పవర్ స్టార్ అంటే ఇష్టం..

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే విజయేంద్ర ప్రసాద్‌కు వ్యక్తిగతం చాలా ఇష్టం. తాను ఎంచుకొన్న మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతారు. ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులెదురైనా వాటిని సమర్ధంగా ఎదుర్కొనే తత్వం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి తను అనుకున్నది సాధించేందుకు ఎంతదూరమైనా వెళతారు. ఆయన వ్యక్తిత్వాన్ని, పోరాట పటిమను చూస్తే ముచ్చటేస్తుంది అని ఇటీవల విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

. కథ రెడీ చేస్తున్నాడట..

. కథ రెడీ చేస్తున్నాడట..

వ్యక్తిగతంగా అమితంగా అభిమానించే పవన్ కల్యాణ్ కోసం కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేస్తున్నారట. జనసేన పార్టీని దృష్టిలో పెట్టుకొని కథను ఆలోచిస్తున్నారట. పవన్ కల్యాణ్ రేంజ్‌కు, అభిమానుల అంచనాలను తలదన్నేలా ఉండే కథ కోసం ఆయన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

జనసేనకు క్రేజ్ వచ్చే విధంగా..

జనసేనకు క్రేజ్ వచ్చే విధంగా..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని విజయపథంలోకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే పవన్ కల్యాణ్ క్రేజ్ మరింత పెరిగే విధంగా సినిమాలు నిర్మించే ఆలోచనలో దర్శకులు ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అలాగే చిరు, పవన్ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ సినిమా కథను ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త టీ సుబ్బిరామిరెడ్డి ఇప్పటికే సిద్ధం చేశారు. ఇదే క్రమంలో విజయేంద్ర ప్రసాద్ కూడా కథను వండుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఆ కథనే తెరకు ఎక్కిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో మైలేజి పెరగడం ఖాయమనే వాదన వినిపిస్తున్నది.

English summary
Baahubali Vijayendra prasad getting story ready for Pawan Kalyan. For baahubali, Vijayendra prasad disigned a Interval bang from Pawan's Inspiration. Now he is developing a story which strengthen Janasena party too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X