For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : ఎన్టీఆర్ 'బాద్‌షా' రిలీజ్ వాయిదా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదల చేస్తారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ వాయిదా అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. 2013 మార్చికి ఫోస్ట్ ఫోన్ చేసే అవకాసం ఉందని ఫిల్మ్ సర్క్లిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం ధియోటర్స్ తాము అనుకున్నన్ని దొరక్కపోవటమే అంటున్నారు. సంక్రాంతి బరిలో మరిన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమవుతూండటంతో సరైన ధియోటర్స్ దొరకవనీ, అవీ తమ రిక్వైర్ మెంట్ కి సరపడ దొరకకపోవచ్చునని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అంటున్నారు. అయితే అపీషియల్ గా ఈ విషయమై న్యూస్ లేదు.

  ఇక ఈ చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో యంగ్ హీరో నవదీప్ కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పాత్ర సినిమాలో ఊహించని విధంగా సాగి నవ్వులు పండిస్తూ కీలకమై నిలుస్తుంది అంటున్నారు. అలాగే కెరిర్ చివరి దశలో ఉన్న నవదీప్ కు ఈ పాత్ర బూస్ట్ ఇస్తుంది. అతనికి ఈ సినిమా చాలా మైలైజి ఇచ్చి వరస ఆఫర్స్ తెచ్చి పెట్టే విధంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు.

  ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్‌.

  అలాగే కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఫైట్ సీన్స్ తీస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినిమాల నుంచి యాక్షన్‌నీ, శ్రీను వైట్ల సినిమాల నుంచి వినోదాన్నీ ఆశిస్తారు. ఇవి రెండూ కలగలిపిన సినిమా ఇది. ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరిస్తాము''అన్నారు. అంతేకాకుండా దూకుడు తరహాలో ఈ చిత్రంలోనూ బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విషయమై స్క్రిప్టు రైటర్ కోన వెంకట్ తన ట్విట్టర్ పేజీలో...ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఉంటారు అన్నారు.

  ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

  English summary
  NTR’s new movie ‘baadshah’ was earlier expected to be released for Pongal, 2013, is heard to have postponed to March due to different reasons. If the movie will be released for Pongal, 2013, the movie might not get good number of theaters to get record number of openings. Hence, the makers are heard to have postponed the movie to the month of March to get more number of theaters for the movie’s release. We have to wait and see how well the makers will get success through their decisions in this regard.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X