For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Balakrishna Bollywood Entry: బాలీవుడ్‌లోకి బాలయ్య.. స్టార్ డైరెక్టర్ దిమ్మతిరిగే ప్లాన్

  |

  ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ.. ఇప్పటికీ తనలోని సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ మధ్య కాలంలో చాలా పరాజయాలను చవి చూసిన ఆయన.. గత ఏడాది విడుదలైన 'అఖండ'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమాను ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అఖండతో బాలయ్య బిగ్ హిట్

  అఖండతో బాలయ్య బిగ్ హిట్

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రమే 'అఖండ'. ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. దీంతో అత్యధిక వసూళ్లతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి కలెక్షన్లు పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు కూడా నమోదు అయ్యాయి. దీంతో ఇది బాలయ్య కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది.

  నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

  గోపీచంద్‌తో మాస్ సినిమాతో

  గోపీచంద్‌తో మాస్ సినిమాతో

  'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం ఓ మాస్ సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

  అనిల్ రావిపూడితో బాలయ్య

  అనిల్ రావిపూడితో బాలయ్య


  టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

  మసాజ్ పిక్‌తో షాకిచ్చిన తెలుగు హీరోయిన్: ఏమీ లేకుండానే కనిపించడంతో!

  సినిమాలో వాళ్లు.. భారీ బడ్జెట్

  సినిమాలో వాళ్లు.. భారీ బడ్జెట్

  అనిల్ - బాలయ్య కాంబోలో రాబోయే ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది సరికొత్త పంథాలో తెరకెక్కించబోతున్నారట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. ఇక, ఈ చిత్రానికి రూ. 80 కోట్లు బడ్జెట్ కేటాయించారని టాక్.

  అలాంటి కథ.. సరికొత్త టైటిల్

  అలాంటి కథ.. సరికొత్త టైటిల్

  నటసింహా బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు సమాచారం. ఈ సినిమాకు వినూత్నంగా 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

  బ్రా తీసేసి అషు రెడ్డి అందాల ఆరబోత: పవన్ కోసం మరోసారి దారుణంగా!

  బాలీవుడ్‌లోకి బాలయ్య ఎంట్రీ

  బాలీవుడ్‌లోకి బాలయ్య ఎంట్రీ

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా నటసింహా నందమూరి బాలకృష్ణ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని ప్రయోగాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అనిల్ రావిపూడితో చేసే సినిమా ద్వారా బాలయ్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తాజాగా తెలిసింది. ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనూ రూపొందనుందని సమాచారం.

  అనిల్ రావిపూడి సూపర్ ప్లాన్

  అనిల్ రావిపూడి సూపర్ ప్లాన్

  నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించే సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి అదిరిపోయే ప్లాన్లు చేస్తున్నాడు. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించే పనిలో భాగంగా.. బాలీవుడ్‌ నుంచి చాలా మంది నటీనటులను తీసుకోబోతున్నాడట. అలాగే, సౌత్‌లోని కొందరు స్టార్లను కూడా ఈ చిత్రంలో భాగం చేస్తున్నాడట. ఇలా ఇప్పటికే కొందరిని సెలెక్ట్ చేశాడని టాక్.

  English summary
  Nandamuri Balakrishna Will Do a Movie Under Anil Ravipudi Direction. Movie Unit Plans Pan India Release for This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X