For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోయపాటి మీద బాలయ్య ఫ్యాన్స్ అసంతృప్తి.. వాడుకోలేక పోతున్నాడంటూ!

  |

  తెలుగులో మాస్ సినిమాలకు బోయపాటి పెట్టింది పేరు.. తన మొదటి సినిమా భద్ర మొదలు చివరిగా రిలీజ్ చేసిన వినయ విధేయ రామ దాత ఆయన సినిమాల్లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మొట్టమొదటి సినిమా భద్రతో సూపర్ హిట్ అందుకున్న ఆయన నందమూరి బాలకృష్ణతో సింహా, లెజెండ్ లాంటి సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

  ప్రస్తుతం బాలకృష్ణతో ఆయన ముచ్చటగా మూడోసారి అఖండ అనే సినిమా చేస్తున్నాడు.. అయితే ఈ సినిమా విషయంలో మా బాలయ్య ఫాన్స్ బోయపాటి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన మీద ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో తెలుసుకుందామా ?

  ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో

  ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో

  వరుస విజయాలతో ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న బాలకృష్ణకు ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా అపజయాలు ఎదురవుతున్నాయి. 2017 మొదట్లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయనకు ఆ సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు.

  ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్లు అందించిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. అఖండ పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

  ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు

  ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు

  వాస్తవానికి చూస్తే వీరిద్దరి కాంబినేషన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పక తప్పదు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో అటు బాలకృష్ణ అభిమానులు ఇటు అభిమానులు ఇద్దరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మీద ఉన్న అంచనాలను మాత్రం బోయపాటి అందుకోలేక పోతున్నారు అని అంటున్నారు.

  తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే ట్రేండింగ్ లోకి వెళ్లి సత్తా చాటింది. ఉగాది రోజు విడుదలైన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి బాలకృష్ణకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అనే విషయాన్ని నిరూపిస్తోంది.

  అసంతృప్తి ఎందుకంటే

  అసంతృప్తి ఎందుకంటే

  ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అనేది ఈ వ్యూస్ ద్వారా చెప్పేయొచ్చు. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు మాత్రం ఈ క్రేజ్ ను వాడుకోలేక పోతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం తాము సాధించిన వ్యూస్ సైతం వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు అని బాలయ్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బాలకృష్ణ కాకుండా వేరే ఏ ఇతర కుర్ర హీరో టీజర్ కి ఈ వ్యూస్ వచ్చినా సరే అద్భుతం అన్నట్లుగా ప్రమోట్ చేసే వాళ్ళు. కానీ బాలకృష్ణ విషయంలో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తున్నా సరే దానిని ప్రమోట్ చేయలేకపోతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Filmibeat Telugu
  అర్ధం చేసుకుంటారా

  అర్ధం చేసుకుంటారా

  మరి ఈ విషయాన్ని బోయపాటి అలాగే సినిమా యూనిట్ ఎంతవరకు అర్థం చేసుకొని ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడతారో తెలియదు. ఇక ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ నుంచి భారీ బంపర్ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దాదాపు 18 కోట్ల రూపాయల మేర ఆ సంస్థ దర్శకనిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం.

  అయితే ఈ సినిమాని నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఓటీటీకి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. , ఇందులో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ కూడా నటిస్తుందని అంటున్నారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి మెయిన్ విలన్‌గా, తెలుగు హీరో శ్రీకాంత్ మరో ప్రతినాయకుడిగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

  English summary
  The combo of Nandamuri Balakrishna and Boyapati Srinu has a huge fan base among audiences. there are huge expectations for their upcoming project Akhanda. However, the makers are unable to capitalize on this craze. so balakrishna fans are unhappy with boyapati.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X