»   »  సీన్ లోకి మళ్లీ బెల్లంకొండ సురేష్ ,బాలయ్య తో సినిమా?

సీన్ లోకి మళ్లీ బెల్లంకొండ సురేష్ ,బాలయ్య తో సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'లక్ష్మి నరసింహ' చిత్రం రిలీజ్ తర్వాత బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మధ్య అగాధాన్ని పెంచిన విషయం తెలిసిందే. బాల‌య్య ఇంట్లో కాల్పుల వ్య‌వ‌హారం త‌ర‌వాత‌.. వీరిద్ద‌రికీ కొంత‌కాలం గ్యాప్ వ‌చ్చింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ మామూలైపోయారు. అప్ప‌టి నుంచీ.. బాల‌య్య‌తో ఓ సినిమా చేయాల‌ని శ‌త‌విథాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు బెల్లంకొండ‌.

అప్పుడెప్పుడో బి.గోపాల్ డైరెక్షన్ లో 'హర హర మహాదేవ'మూవీనిసెట్స్ పైకి తీసుకురావాలని ఆగ మేఘాల మీద బెల్లంకొండ చేసిన హడావుడి కాస్త పోస్టర్ల ఏర్పాటుతో వెకిలి చేష్టగా మారి ఆ సినిమా షెడ్డుకెళ్ళేలా చేసింది.

Balakrishna green signal to Bellamkonda?

ఈ సినిమా తర్వాత ఆచి తూచి అడుగులేస్తున్న బెల్లంకొండ సురేష్ మళ్ళీ బాలకృష్ణను ఒప్పించాడు. 'వీడు తేడా' ఫెమ్ చిన్నికృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ లో బాలకృష్ణ మళ్లీ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పుకున్నారు. ఆ సినిమాని ముందుకు వెళ్లలేదు. ఇవన్నీ కాదు..పూరి జగన్నాథ్ తో సినిమా అని ప్రెస్ మీట్ కూడా పెట్టేసారు. ఆ సినిమా కూడా ఆగిపోయింది.

అయితే ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ సైతం త‌న కుమారుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ని హీరోగా ప్ర‌మోట్ చేసుకొనే కార్య‌క్రమంలో బిజీలో పడ్డారు. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీ టైమ్ బాగుంది. సీనియర్ హీరోల సినిమాలు ఆడుతున్నాయి. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ... తనకు పరిచయమున్న హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకొన్న‌ట్టు టాక్‌.

అందులో భాగంగా ఈమ‌ద్య బెల్లంకొండ నందమూరి బాల‌కృష్ణ‌ని క‌లిసి... 'మీ డేట్లు కావాలి... మీతో సినిమా చేయాల‌నివుంది' అని అడిగారని వినికిడి. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి త‌ర‌వాత బాల‌య్య, బెల్లంకొండ మ‌ధ్య సినిమాకి సంబంధించిన చ‌ర్చ‌లు న‌డిచిన‌ట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్.

మొత్తానికి కొన్ని కండీషన్స్ తో ...బెల్లంకొండ బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి బాల‌య్య ఓకే అన్నారని చెప్పుకుంటున్నారు. దాంతో బెల్లంకొండ ప్రస్తుతం తన మిగతా పనులు అన్నీ ప్రక్కన పెట్టి...బాల‌య్య‌కు త‌గిన క‌థ కోసం అన్వేష‌ణ ప్రారంభించేశాడ‌ని తెలుస్తోంది.

ఓ స్టార్ రైటర్ ని రప్పించి... బాల‌య్య కోసం క‌థని రెడీ చేయిస్తున్నారట. కథ పూర్తయ్యాక...బాలయ్య ఏ డైరక్టర్ తో చెప్తే ఆ దర్శకుడుతో ముందుకు వెల్తారట. లేదా తన కుమారుడుని డైరక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను తోనూ ముందుకు వెల్లే అవకాసం ఉందిట. ఇక బాల‌య్య త‌న 101వ చిత్రం భ‌వ్య ఆర్ట్స్‌కి చేయాల్సివుంది. 102వ సినిమాగా బెల్లంకొండ‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు.

English summary
The most awaited combination of Balakrishna and Bellamkonda Suresh is under discussions, says close aides of the Bellamkonda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu