»   » బాలకృష్ణ గెస్ట్ గా ఆ యంగ్ హీరో చిత్రంలో ...!?

బాలకృష్ణ గెస్ట్ గా ఆ యంగ్ హీరో చిత్రంలో ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ త్వరలో మంచు మనోజ్ తాజా చిత్రం ఊ కొడతారా...ఉలిక్కి పడతారా లో గెస్ట్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర కీలకమై నిలుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మోహన్ బాబుకీ, బాలయ్యకీ ఉన్న అనుబంధంతో ఈ చిత్రంలో చేయటానికి కమిటయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇక త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది. కొత్త తరహా కథ, కథనంతో ఈ స్క్రిప్టు రూపొందనుందని చెప్తున్నారు. ఇక ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న..

తమ సొంత బ్యానర్ పై నిర్మించనుంది. ఈ చిత్రం గురించి మనోజ్ మాట్లాడుతూ..కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ చిత్రాల్లో సరికొత్త ప్రయోగంలా ఆ చిత్రం వుంటుంది అని అన్నారు. బిందాస్ చిత్రంతో ఓకే అనిపించుకున్న మనోజ్ తర్వాత వచ్చిన వేదంతో నటుడుగానూ ప్రూవ్ చేసుకున్నారు.అలాగే ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

English summary
For the first time Balakrishna is making a guest appearance in another film. Balakrishna was impressed with the 
 
 storyline of Manchu Manoj' ‘Oo Kodathara Ulikki Padathara’ and his character which would come in the flashback 
 
 episode. The flashback scene would be like a backbone for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu