నష్టాలతో సీ కల్యాణ్ గిలగిల.. బాధపడకు.. నేనున్నా.. టాప్‌హీరో బంఫర్ ఆఫర్..
Recommended Video

జయసింహతో కెరీర్‌లోనే హిట్టు కొట్టామనే ఆనందం నిర్మాత సీ కల్యాణ్ ఎక్కువ కాలం నిలువలేదు. ఆ తర్వాతనే సాయిధరమ్ తేజ్‌తో రూపొందించిన ఇంటెలిజెంట్ చిత్రం సీ కల్యాణ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది. అయితే నష్టాల్లో కూరుకుపోయిన సీ కల్యాణ్‌కు నందమూరి బాలకృష్ణ బంపర్ ఆఫర్ ఇచ్చారనే వార్త సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నది.

ఇంటిలిజెంట్ దెబ్బ
జైయసింహ తర్వాత సీ కల్యాణ్ రూపొందించిన ఇంటెలిజెంట్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం దాదాపు రూ.27 కోట్లతో రూపొందింది. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

15 కోట్ల నష్టం
ప్రపంచవ్యాప్తంగా ఇంటిలిజెంట్ చిత్రానికి కలెక్షన్లపరంగా నిరాశే మిగిలింది. ఈ చిత్రం దాదాపు రూ.8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో సీ కల్యాణ్‌కు సుమారు 15 కోట్ల నష్టం వాటిల్లింది.

దెబ్బకు నీరుగారిన కల్యాణ్
ఇంటిలిజెంట్ దెబ్బకు సీ కల్యాణ్ నీరుగారిపోయాడు. ఆ విషయం బాలయ్య చెవిన పడిందట. జై సింహ చిత్ర షూటింగ్‌లో బాలయ్య, కల్యాణ్ మధ్య మంచి రిలేషన్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాత కల్యాణ్‌ను నష్టాల నుంచి బయటకు పడేసే ప్రయత్నం బాలయ్య చేస్తున్నాడట.

నష్టాల నుంచి గట్టెక్కిందుకు
ఇంటెలిజెంట్ నష్టాల నుంచి సీ కల్యాణ్‌ను లాగేందుకు ఓ సినిమా చేస్తానని బాలయ్య మాటిచ్చాడట. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్టు తెలిసింది. బాలయ్యతో సినిమా చేసి నష్టాలను పూడ్చుకొనే పనిలో సీ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం.

బాలయ్యతో వీవీ వినాయక్
ఇక బాలయ్య సినిమాకు ఇంటెలిజెంట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. బాలకృష్ణ ఒకే అంటే వినాయక్ డైరెక్షన్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











