»   » సెట్ అవుద్దా? :మహేష్ తో అనుకున్న సబ్జెక్టుని బాలయ్యతో చేస్తున్నారు

సెట్ అవుద్దా? :మహేష్ తో అనుకున్న సబ్జెక్టుని బాలయ్యతో చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ 'జన గణ మణ' అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన 'పోకిరి', 'బిజినెస్‌మేన్'.. రెండూ హిట్టే. దాంతో 'జన గణ మణ' ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. కానీ కథ పై నచ్చకో, పూరి పై నమ్మకం లేకో ...మహేష్ ఆ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసాడు.

దానితో వెంటనే ఆ సినిమాను వెంకటేష్ దగ్గరకు తీసుకెళ్ళి.. ఇది ఆయన 75వ సినిమాగా చేసేద్దాం ప్లాన్ చేసుకున్నాడు జగన్. దాదాపు అంతా ఫైనల్ అనుకున్నప్పుడు బడ్జెట్ విషయంలో సురేష్ బాబు నో చెప్పేసాడంటూ.. రూమర్లు వచ్చేశాయి, ఆ ప్రాజెక్టు అటకెక్కేసింది. దాంతో ఎటూ పాలుపోని పూరి...ఆ స్క్రిప్టుని బాలయ్యకు నేరేట్ చేసారని సమాచారం.

Balakrishna In Mahesh's 'Jana Gana Mana'?

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంతో 50 కోట్ల క్లబ్ లోకి వెళ్లిన బాలయ్యపై ఈ 45 కోట్ల బడ్జెట్ వర్కవుట్ అవుతుందని భావించి ఓకే చేసినట్లు చెప్తున్నారు. అయితే బాలయ్య ఇప్పుడు తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో తన తదుపరి చిత్రం కోసం చర్చలు జరుపుతున్నారు. దాంతో పూరి జనగనమణ చిత్రం వెంటనే డేట్స్ ఇచ్చి మొదలెడతారా లేక గ్యాప్ వస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది. కాకపోతే అందరికీ ఒకటే డౌట్...అసలు మహేష్ తో అనుకున్న సబ్జెక్టు ని ఎంత ఓకే చేస్తే మాత్రం బాలయ్యతో వర్కవుట్ అవుతుందా అని..ఇద్దరి బాడీ లాంగ్వేజి, డైలాగు చెప్పే విధానం అంతా వేర్వేరు కదా.

మరో ప్రక్క 101వ సినిమాగా ఓ పక్కా మాస్ మసాలా మూవీ చేసేందుకు రెడీ అయిన బాలయ్య.. తాజాగా ఓ ఫ్యాక్షన్ మూవీకి ఓకే చెప్పాడని టాక్. అలాగే ఈ చిత్రం డైరక్టర్ ఎవరూ అంటే...తమిళ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ అని తెలుస్తోంది. ఈ సారి బాలయ్య చేయబోయే చిత్రం..'సమరసింహారెడ్డి' తరహాలో బాలయ్య అదరగొట్టే ఫ్యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు హీరోయిన్ గా తమన్నాను, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.

నిజానికి గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత .. తన తండ్రి, మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్ గా మార్చే పనిలో పడ్డారు. తండ్రి సినిమాకి పరిశోధనకు ఎక్కువగా టైమ్ పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే రావాలని బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. తన 101 సినిమా డైరక్షన్ బాధ్యతలు ఆయనకే ఇవ్వనున్నట్లు సమాచారం.


ఇక ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని వినపడుతోంది. ఇంతకీ అంతగా మెప్పించిన కథ ఏమిటని ఆరా తీస్తే.. అది మాస్ మసాలతో నిండిన ఫ్యాక్షన్ స్టోరీ అని తెలిసింది. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములాతోనే ఇప్పుడు వచ్చేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట.

English summary
After Mahesh babu and Venkatesh, Puri Jagannath has reportedly taken his prestigious project, 'Jana Gana Mana' to Balakrishna Nandamuri.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu