చిరు స్క్రిప్ట్ పై టాలీవుడ్ అగ్రహీరోల డేగ కన్ను...!?

By Sindhu

కొద్దికాలం క్రిందట మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఓ కథను సిద్దం చేశామని 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" అనే టైటిల్ ను నిర్ణయించినట్టుగా ఓ సందర్భంలో తెలియజేశారు. అయితే ఇటీవలే చిర తన 150వ చిత్రాన్ని త్వరలోనే చేస్తానని చెప్పడంతో, ప్రస్తుతం ఈ స్ర్కిప్ట్ కు డిమాండ్ బాగా పెరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ స్వాతంత్ర సమరయోధుడు జీవితగాధ ఆధారంగా తయారు చేసిన ఈ స్క్రిఫ్ట్ పై టాలీవుడ్ అగ్ర హీరోల కన్నుపడింది..

చిరంజీవి కోసం తయారు చేసిన ఈ కథకోసం, ప్రస్తుతం నటసింహా బాలకృష్ణ, మంచు మోహన్ బాబులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ ఇటీవలే రాజకీయాల్లో పోటీ చేస్తానంటూ చెప్పడం, అదేవిధంగా సమయం దొరికినప్పుడల్లా రాజకీయం వైపు తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు మోహన్ బాబు. అయితే వీరిద్దరికి కూడా ఈ 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" స్క్రిప్ట్ పై ఆశ పుట్టింది. పైగా ఈ చిత్ర టైటిల్ సింహం ఉందని, తనకు సింహం అనే పేరున్న చిత్రాలన్ని ఘన విజయం సాధించాయని, కనుక ఆ చిత్ర స్క్రిప్ట్ నేను చేస్తేనే బాగుంటుందని బాలయ్య కోరికతో ఉన్నాడంట.

అదేవిధంగా పరాజయాలు తప్ప విజయాలు దక్కించుకోలేకపోతున్న మోహన్ బాబు..ఈ చిత్రం ద్వారా అయినా అటు సినిమాల ద్వారా, ఇటు సందేశాత్మక చిత్రంగా ప్రజలకు దగ్గర కావొచ్చిని, ఈ చిత్రం రాజకీయపరంగా కూడా తనకు ఎంతో ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నట్టు తెలిసింది...మరి ఈ 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" ఏ అగ్రహీరోని వరించనుందో..లేకపోతే ఉన్నవాళ్లందరూ కూడా ఒకేసారి ఈ ప్రాజెక్ట్ ను చేయకుండా వదిలేస్తారా అనే విషయం కూడా ఇప్పుడే చెప్పలేం..మరికొంత కాలం వేచి చూడాల్సిందే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X