»   » అయ్యో... బాలకృష్ణ గెస్ట్...కేవలం రూమరేనా?

అయ్యో... బాలకృష్ణ గెస్ట్...కేవలం రూమరేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ ఆడియో పంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంటే ఆ క్రేజే వేరు. గత కొద్ది రోజులుగా సౌఖ్యం చిత్రం ఆడియోకు ఆయన వస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన వచ్చే అవకాసం లేదని సమాచారం. ఈ మేరకు అఫీషియల్ గా ఎక్కడా ప్రకటన సైతం రాలేదు.

గోపీచంద్‌ నటిస్తున్నా సౌఖ్యం చిత్రాం అడియోకి బాలకృష్ణ ముఖ్య అతిధిగా రాబోతున్నారన్న అనే న్యూస్ గురించి మీడియావారు..బాలకృష్ణకు చెందిన అధికారులతో మాట్లాడారు. గత 2 రోజుల క్రితం నుండి వస్తున్న రూమర్స్ లో వాస్తవం లేదని తెలిపారు.

హిందూపురం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ,నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘డిక్టేటర్' మూవీ షూటింగ్ ఢిల్లీలోని మెట్రో రైలులో జరుగుతోంది. ఆయన ఆ బిజీలో ఉన్నారు.

Balakrishna not attending Soukyam audio

ఇక గోపీచంద్ హీరోగా, రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ''సౌఖ్యం'' . భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని, ఎ.ఎస్‌.ర‌వికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు మినహా టాకీ పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఆడియోకి సంబందించిన పోస్టర్ (ట్వీట్) ఇక్కడ చూడవచ్చు.


దర్శకుడు మాట్లాడుతూ....అతను కొట్టాలనుకొంటే ఒంటిచేత్తో వందమందిని చితగ్గొట్టేస్తాడు. సిక్స్‌ ఫీట్‌, సిక్స్‌ప్యాక్‌ బాడీ చూసినవాళ్లెవ్వరికీ ఆ డౌటు ఉండదు. కానీ... బాడీ చెప్పినదానికంటే బ్రెయిన్‌ చెప్పిన దానికే ఎక్కువ విలువ ఇస్తాడు. ఆటమ్‌ బాంబు వాడాల్సిన చోట కూడా 'ఐడియా'తోనే సరిపెడతాడు. ఆలోచన అనే ఆయుధంతో... ఎవ్వరితో అయినా చెడుగుడు ఆడేసే అతగాడి కథే... 'సౌఖ్యం' అంటున్నారు దర్సకుడు.

'యజ్ఞం' తరవాత గోపీచంద్‌తో మరో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. వినోదం, కుటుంబ బంధాలకు పెద్ద పీట వేసిన చిత్రమిది. గోపీచంద్‌ శైలి యాక్షన్‌ దృశ్యాలూ ఉంటాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయి''అన్నారు దర్శకుడు.

అంతా సౌఖ్యమేనానేను సుఖంగా ఉండాలనుకోవడం స్వార్థం. నాతో పాటు అందరూ బాగుండాలనుకోవడం మంచితనం. ఎదుటివాళ్ల సౌఖ్యం కోసం తన సంతోషాల్ని త్యాగం చేయడం గొప్పతనం. ఏదో ఓ మాయ చేసి, తాను హ్యాపీగా ఉంటూ అందరి కళ్లల్లో ఆనందం చూడటం లౌక్యం. అలాంటి లౌక్యమున్న యువకుడి కథే మా 'సౌఖ్యం' అంటున్నారు గోపీచంద్‌.

English summary
Bhavya Creations official Twitter hasn't confirmed Balayya's attendance for 'Soukyam' even until now.
Please Wait while comments are loading...