»   » బాలకృష్ణ నరుకుడు డైలాగుకి ఓ రేంజిలో రెస్పాన్స్

బాలకృష్ణ నరుకుడు డైలాగుకి ఓ రేంజిలో రెస్పాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలకృష్ణ చిత్రం అంటే డైలాగ్స్ కి పెట్టింది పేరు. అందులోనూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో వచ్చిన సింహా లో డైలాగ్స్ కి ఓ రేంజిలో రెస్పాన్స్ రావటంతో వారి కాంబినేషన్ లో రూపొందుతున్నవ తాజా చిత్రంలోనూ డైలాగ్స్ పై దర్శకుడు,హీరో ప్రత్యేక పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో డైలాగు అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో, వెబ్ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందుతోంది. ఇంతకీ ఈ డైలాగు సినిమాలో ఉందో లేదో కానీ నందమూరి అభిమానులను బాగానే అలరిస్తోంది. ఆ డైలాగు ఏమిటంటే...

"నరకుకుంటూ వెళ్తే నీకు అలుపు వస్తుందేమో .... నాకు ఊపు వస్తుంది..."

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై తెరకెక్కిస్తున్నారు.గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనీల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా చేస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అంతా మొదట అనుకున్నారు. కానీ పిబ్రవరికి వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్‌ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.

English summary

 Balayya –Boyapati pair is one of the best mass combination in Tollywood. The powerful dialogues created bit sensation and now once again the mass hearted director penned more energetic dialogues for his upcoming movie Legend.Here is one of the dialogue doing rounds on internet: “Narukkuntu velthe neeku alupu vastundemo…Naaku oopu vastundi”. The dialogue went viral on internet and the expectations of fans were doubled over night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu