»   » హాట్ టాపిక్: శ్రీనువైట్లకు స్టేజిపై షాక్ ఇచ్చిన బాలకృష్ణ (వీడియో)

హాట్ టాపిక్: శ్రీనువైట్లకు స్టేజిపై షాక్ ఇచ్చిన బాలకృష్ణ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ చాలా విషయాల్లో చాలా ఓపిగ్గా ఉంటారు. అంతెందుకు...మొన్న జరిగిన టీవీ 9, టీఎస్సార్ అవార్డుల పంక్షన్ లోనూ మూడు గంటలు సేపు అలాగే నిలబడి ఆశ్చర్యపరిచారు. అందులోనూ ఆయన చాలా గౌరవంగా అందరితో వ్యవరిస్తూంటారు. అయితే తాజాగా అదే స్టేజిపై జరిగిన అందరినీ షాక్ చేసింది. అయితే అది మైక్ లేదనుకుని బాలయ్య చెప్పారు. అయితే మైక్ ఆన్ చేసి ఉండటంతో అందరికీ వినపడింది. ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాద్షా చిత్రం కోసం బెస్ట్ డైరక్టర్ అవార్డుని తీసుకోవటానికి శ్రీను వైట్ల స్టేజిపైకి రాగా, బాలకృష్ణ తాను ఆ అవార్డుని ఇవ్వటానికి ఇంట్రస్ట్ లేదన్నట్లుగా చెప్పేసారు.అంతేకాదు బాలయ్య ఐ కాంటాక్టు కూడా శ్రీను వైట్ల కూడా లేదు. బండ్ల గణేష్ తో కూడా అలాగే బిహేవ్ చేసారు. ఇంతకీ కారణం ఏమిటనే గుసగుసలు బయిలు దేరాయి. బాద్షా చిత్రంతో ఆయన్ను స్పూప్ చేసారని, అందుకే శ్రీను వైట్ల అంటే కోపం అని చెప్పుకుంటున్నా్రు. ఆ వీడియోని ఇక్కడ చూడండి


ఈ స్టేజిపై...

'లెజెండ్‌'కిగానూ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొన్న బాలకృష్ణ మాట్లాడుతూ ''కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడానికి స్ఫూర్తి మా నాన్నగారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే'ఆదిత్య 369', 'భైరవద్వీపం' లాంటి సినిమాలు చేశాను''అన్నారు.

Balakrishna Refuses To Present Award To Sreenu Vaitla

చిరంజీవి మాట్లాడుతూ... ''పురస్కారాలు కళాకారులకు వూపిరిలా, ఉత్సాహంలా పనిచేస్తాయి. మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్నిస్తాయి. మన చిత్రాలు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందుతున్నాయి. వాటి వెనక పురస్కారాల ప్రేరణ ఎంతో ఉంటుంది''అన్నారు మెగా స్టార్, ఎంపీ చిరంజీవి.

అలాగే చిరంజీవి మాట్లాడుతూ ''మా బాలయ్య బాబుకి అవార్డు వచ్చినందుకు అభినందిస్తున్నా. ఏ ఒక్కరినో సంతోషపెట్టడానికి పురస్కారాలు ఇవ్వరు. ప్రతిభను, కళల్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే పురస్కారాలు అందజేస్తుంటారు.'బాహుబలి' లాంటి అత్యద్భుతమైన చిత్రాలు మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తుండటం ఆనందంగా ఉంది. '300', 'ట్రాయ్‌'లాంటి సినిమాలకి దీటుగా 'బాహుబలి'ని తీసి తెలుగువారందరికీ గర్వకారణంలా నిలిచాడు రాజమౌళి'' అని ప్రశంసించారు.

English summary
In the recent TRST-Tv9 National Awards event held in Hyderabad on Sunday night, Balayya was found saying that he’ll not present the award to Srinu Vaitla and suggested TSR to give away the award instead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu