»   » బాలకృష్ణ సినిమాలో పూనమ్ పాండే?

బాలకృష్ణ సినిమాలో పూనమ్ పాండే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో తాను ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఆ చిత్రం వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరిస్తోంది. దీంతో ఆమె బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జయసింహ'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఎంపికయిందనే ప్రచారం జరుగుతోంది.

నగ్నంగా ఫోటో షూట్లు, ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు, న్యూడ్ టాక్‌తో పబ్లిసిటీ పెంచుకున్న పూనమ్ పాండే ఇటీవల 'నషా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ ప్రేక్షకులు ఊహించిన రేంజిలో లేక పోవడంతో బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో సౌత్ సినిమాలపై దృష్టి పెట్టిన అమ్మడు తన అందాలతో దండయాత్రకు సిద్ధమౌతోంది.

balakrishna-poonam

నగ్నంగా నటించడానికి, శృంగార సీన్లలో రెచ్చిపోవడానికి ఏ మాత్రం సంకోచించని పూనమ్ పాండే‌ బాలయ్య సినిమాల్లో నటించబోతోందనే వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ సినిమాలో ఆమె ఐటం సాంగు చేయబోతోందా? లేక ఏదైనా ప్రత్యేక పాత్రలో కనిపించబోతోందా? అనేది తేలాల్సి ఉంది.

'జయ సింహా' చిత్రంలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

English summary
Poonam Pandey saying that she is acting in Tollywood project but she is not revealing the title or the details of the flick. Analysts are feeling that she might be roped into the role of Balakrishna – Boyapati’s upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu