»   » మెగా క్యాంపు: నాకు, ఎన్టీఆర్ మధ్య గొడవలు పెట్టాలనే...!

మెగా క్యాంపు: నాకు, ఎన్టీఆర్ మధ్య గొడవలు పెట్టాలనే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘టెంపర్' సినిమా విడుదలకు ముందు రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ ఫైనాస్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే టెంపర్ షూటింగ్ ఆలస్యం అయిందని, చివరి షెడ్యూల్‌కు గణేష్ అసలు డబ్బులే ఇవ్వలేదని, పూరి జగన్నాథ్ తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడని, తాను పెట్టిన పెట్టుబడికి ప్రతిగా ఓ ఏరియా రైట్స్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌కు కూడా లెక్క ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు అడ్వాన్సుగా ఇవ్వలేదని సైతం కొందరన్నారు.

మొత్తానికి ‘టెంపర్' సినిమా విడుదలైంది. సూపర్ హిట్ టాక్ రావడంతో నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు పూరి, ఎన్టీఆర్ తదితరులు పార్టీ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు వచ్చిన వార్తలపై బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో తనదైన రీతిలో స్పందించారు. టెంపర్ సినిమా విషయంలో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవని గణేష్ స్పష్టం చేసారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Bandla Ganesh about Temper

నాకు... ఎన్టీఆర్, పూరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట నిజమే. అయితే మా మధ్య ఎలాంటి విబేధాలు రాలేదనేది మాత్రం వాస్తవం. కొందరు మాపై రూమర్స్ ప్రచారం చేయడం ద్వారా నాకు, ఎన్టీఆర్ మధ్య గొడవలు పెట్టాలని ట్రైచేసారు. ఎందుకంటే నేను మెగా క్యాంపు నిర్మాతగా ముద్రపడ్డ వ్యక్తికాబట్టే ఇలా చేసారు. కానీ నేను ఎవరితో పని చేస్తే వారి క్యాంపు నిర్మాతను అయిపోతాను. నాకు అందరి హీరోలతో మంచి స్నేహబంధం ఉంది, అందరితో పని చేయాలని కోరుకుంటాను. నేను తీసిని ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని, చూసిన ప్రేక్షకులు సంతోషంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాను అన్నారు.

నాకు పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి వారు. నిర్మాతగా నాకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తి. ఆయనతో తీసిన నా సినిమా ప్లాపయిన తర్వాత నన్ను పలిపిచి మరీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా తల్లిదండ్రుల తర్వాత నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు గణేష్.

టెంపర్ సినిమా విషయంలో ప్రసాద్ వి పొట్లూరి చేసిన సహాయం గురించి గణేష్ స్పందిస్తూ...పివిపిగారు నాకు పెద్దన్నయ్య లాంటి వారు. టెంపర్ సినిమాకు బయ్యర్లు తక్కువ రేటు ఇస్తానన్నపుడు డైరెక్టుగా రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆయన చాలా సహాయం చేసారు. బయ్యర్లు కేవలం 8 కోట్లకే టెంపర్ రైట్స్ అడిగారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇపుడు సినిమా బాగా ఆడుతుంది. ఎన్టీఆర్ గత సినిమా రామయ్యా వస్తావయ్యా సరిగా ఆడలేదు. ఎన్టీఆర్-పూరి కాబినేషన్లో వచ్చిన ఆంధ్రవాలా కూడా యావరేజ్. అందుకే బయ్యర్లు తక్కువ అమౌంట్ కోట్ చేసి ఉంటారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

English summary
"A few people tried their best to create rift between me and NTR by spreading rumours that I am a mega camp producer and that I was partial to heroes from their camp. However, like financial troubles, this too is a false rumour." Bandla Ganesh said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu