»   » 'చంద్రముఖి' సీక్వెల్ రైట్స్ ఆ తెలుగు ప్రొడ్యూసర్ దగ్గరే!?

'చంద్రముఖి' సీక్వెల్ రైట్స్ ఆ తెలుగు ప్రొడ్యూసర్ దగ్గరే!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, జ్యోతికల కాంబినేషన్ లో పి.వాసు రూపొందించిన 'చంద్రముఖి' చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం చంద్రముఖి సీక్వెల్ గా ఆప్తరక్షక టైటిల్ తో కన్నడంలో విష్ణు వర్దన్ హీరోగా పి వాసు చిత్రం రూపొందించి సూపర్ హిట్ చేసారు. దాంతో తెలుగులో బడా నిర్మాతల కళ్ళు ఆ చిత్రం రైట్స్ పై పడ్డాయి. అయితే అందరికంటే ముందుగా బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేసారు. పి వాసు కి తెలుగు వెర్షన్ నిమిత్తం పెద్ద మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పి.వాసు ఈ చిత్రంలో రజనీకాంత్ ని నటింపచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారాన్ని బట్టి రజనీ ఈ ప్రాజెక్టుకు మొగ్గు చూపటం లేదు. దాంతో హీరో ఎవరన్నది సందిగ్ధంలో పడింది. అది తేలితే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఇక బెల్లంకొండ సురేష్ ఇంతకుముందు నాడోడిగల్ రైట్స్ తీసుకుని శంభో శివ శంభో చిత్రం తీసి సంక్రాంతికి రిలీజ్ చేసారు. అలాగే అంతకు ముందు రజనీ చేసిన శివాజీని ఇక్కడ బెల్లంకొండే రిలీజ్ చేసి లాభాలు పొందారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu