»   » భూమిక 'యోగా వీడియో' మార్కెట్లోకి...

భూమిక 'యోగా వీడియో' మార్కెట్లోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శిల్పాశెట్టి, బిపాసా బసు ఓ ప్రక్క యోగా వీడియోలతో మార్కెట్లో చెలరేగిపోతూంటే మనం మాత్రం ఆగటమెందుకనుకుందో ఏమో భూమిక కూడా రంగంలోకి దూకుతోంది. ఆమె భర్త ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ తో కలసి ఈ వీడియోని ప్లాన్ చేస్తోంది. యోగా ప్రయోజనాలు, కొన్ని యోగాసనాలు వేసి భూమిక చూపుతుంది. అయితే మేజర్ యోగాసనాలు మాత్రం భరత్ ఠాకూర్ వేయనున్నారు. అతని శిష్యులు అనూష్క వంటి పాపులర్ స్టార్స్ కూడా ఈ వీడియోలో చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకి సంభందించిన స్క్రిప్టు పని జరుగుతోందని తెలుస్తోంది. ఇక ప్రజల్లో యోగా పట్ల ఎవేర్ నెస్ తేవటానికే ఈ ప్రయత్నం అని వారి శ్రేయాభిలాషులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మరింత మార్కెట్ పెంచుకోవటానికి, మిగతా బిజెనెస్ లలో వచ్చిన నష్టాన్ని కొంతైనా పూర్చుకోవటానికే ఈ యోగావీడియో అంతర్గత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం భూమిక తమ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే కలెక్టర్ గారి భార్యలోనూ ప్రకాష్ రాజ్ సరసన చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu