Bhavadeeyudu Bhagat Singh మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. మళ్ళీ స్పీడ్ పెంచనున్న పవర్ స్టార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా పూర్తి కాకముందే మరొక సినిమా పై క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక కొంత మంది స్టార్ హీరోలు అయితే ఒకేసారి నాలుగైదు సినిమాలను ప్రకటించడం విశేషం. చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు అసలు రెస్ట్ దొరికే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం పక్కా అని అర్ధమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ నెక్స్ట్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ అయినటువంటి భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన పనులను కూడా పూర్తి చేయనున్నాడు. అయితే మరోవైపు హరిహర వీరమల్లు సినిమా కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అదే స్పీడ్ లో హరీష్ శంకర్ ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ అభిమానులు అందరికీ కూడా బాగా నచ్చేసింది. విడుదలైన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. గబ్బర్ సింగ్ కాంబో మరొకసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయగలరు అని అర్థమవుతుంది.

Bhavadeeyudu BhagatSingh to be launched on 15 October

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ అక్టోబర్ 15న అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అదే రోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ లో కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఫిక్స్ అయినట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఇదివరకే బుట్ట బొమ్మ తో డీజే, గద్దల కొండ గణేష్ సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తరహాలోనే పూజా హెగ్డేను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఇక మరో వైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను కూడా ఇదే ఏడాది పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ఎమ్.రత్నం పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా భారీ స్పందన లభించింది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన పాటను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X