twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం, దిల్ రాజు అంటున్నారు

    By Srikanya
    |

    Dill Raju
    హైదరాబాద్: తాను తీవ్రంగా నష్టపోయానంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు వివాదంతో తెరమీదకు వచ్చిన వ్యక్తి దిల్ రాజు. ఆయనకు వరసగా దెబ్బలు తగులుతున్నాయి. దాంతో పాపం, దిల్ రాజుకు రోజులు బాగున్నట్లు లేదు అని ఇండస్ట్రీ వారు భాధపడుతున్నారు. దిల్‌రాజు అంటే లక్ అనుకున్నవారు సైతం, పరిస్థితి రివర్స్ కావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ సినిమా హక్కులు కొంటే అదే ఫట్ మంటోంది. దమ్ము, తూనీగ తూనీగ, శిరిడిసాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెబల్, తాజాగా కెమెరామెన్ గంగతో రాంబాబు ఇవన్నీ దిల్‌రాజుకు తగుల్తున్న షాక్‌లే. అయితే ఈ మద్య కాలంలో ఆయనకు రిలీఫ్ ఇచ్చింది గబ్బర్ సింగ్ మాత్రమే.

    కెమెరామెన్ గంగతో రాంబాబు ను ఏకంగా పది పనె్నండు కోట్లకు పై మొత్తానికే నైజాం హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు గగనం, ఓ మై ఫ్రెండ్ కూడా లాస్ లే తప్ప కలిసి వచ్చేందేమీ లేదు. వాటికి ముందు ఆకాశమంత, జోష్, మరోచరిత్ర, రామరామ కృష్ణకృష్ణ గట్టిదెబ్బలే తీసాయి. ఇక తాజాగా నాగార్జున ఢమరుకం ఒకటి మిగిలి వుంది. ఆ చిత్రం రిలీజ్ సైతం వెనక్కి పోయింది.

    అయితే నిర్మాతగా మాత్రం ఇప్పుడు అందరి దృష్టీ పెద్ద మల్టీస్టారర్‌గా పేరుపడుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మీదే ఉంది. ఈ చిత్రంతో అయినా ఆయన అదృష్టం తిరుగుతుందేమో అంటున్నారు. 'నా' అంటే నా కుటుంబం అని అర్థం. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, అన్న, వదిన, బాబాయ్‌... ఇలా ఎన్ని బంధాలున్నాయో. అవన్నీ మా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చూపిస్తున్నాం. సంతోషం అనేది విలాసవంతమైన జీవితాల్లోనో, ఖరీదైన నివాసాల్లోనో ఉండదు. మన చుట్టూ ప్రేమించే వాళ్లుంటే.. పూరి గుడిసెలోనైనా హాయిగా బతికేయొచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విజయవంతమైంది అక్కడే అంటున్నారు దిల్‌రాజు. ఆయన తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరగుతోంది.

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్నారు. సమంత, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ''భారతదేశం ఓ సీతమ్మ వాకిలి. అందులో సిరిమల్లె చెట్టు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అందులోని మమతానురాగాలను మా సినిమాలో చూపిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది'' అని చెప్పారు.

    సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

    English summary
    Dil Raju, the man with midas touch, seems to have landed in big trouble by acquiring the Nizam theatrical rights of the Pawan Kalyan starrer Camera Man gangato Rambabu for a whooping price and releasing it in a big way.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X