బడా మల్టీస్టారర్‌లో అభిజీత్: ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సందడి.. డైరెక్టర్ సూపర్ ప్లాన్ అదుర్స్

హీరోగా కెరీర్‌ను ఆరంభించాడు లవర్ బాయ్ అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'తో సినీరంగ ప్రవేశం చేసిన అతడు.. ఆ తర్వాత 'రామ్ లీలా' అనే సినిమాను కూడా చేశాడు. వీటి వల్ల అతడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు విన్నర్ అవడం ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుని, సినిమా ఆఫర్లు కూడా దక్కించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఓ భారీ మల్టీస్టారర్‌లో అభిజీత్ నటించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

లవ్ ట్రాకులతో మొదలు పెట్టిన అభి

లవ్ ట్రాకులతో మొదలు పెట్టిన అభి

అందరిలానే బిగ్ బాస్ ఎంట్రీలోకి సాదాసీదా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అభిజీత్. స్టేజ్ మీద ఉన్నప్పుడే హీరోయిన్ల ఫొటోలతో ఆడిన గేమ్‌తో అతడిని లవర్ బాయ్‌ను చేసేశారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంటర్ అయిన సమయంలో మోనాల్ గజ్జర్‌తో ట్రాక్ నడిపాడు. అది మధ్యలోనే ఆగిపోవడంతో దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. ఇలా ఆరంభం నుంచే హాట్ టాపిక్ అయ్యాడు.

ఆ టాస్క్ అతడి గేమ్‌ను మార్చేసింది

ఆ టాస్క్ అతడి గేమ్‌ను మార్చేసింది

అమ్మాయిలతో ఎక్కువగా కనిపిస్తుండడంతో అభిజీత్‌ను అలా హైలైట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, రోబోట్ టాస్క్‌ తర్వాత అభిప్రాయాలను మార్చేశాడు. అందులో మాస్టర్ మైండ్‌ గేమ్ ఆడిన అతడు.. తన జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాదు, నాగార్జునతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ టాస్కులో జరిగిన గొడవతో సానుభూతిని కూడా పొందాడు.

ప్రేక్షకులకు చేరువ.. విజేతగా నిలిచి

ప్రేక్షకులకు చేరువ.. విజేతగా నిలిచి

హౌస్‌లోని కంటెస్టెంట్లు తరచూ నామినేట్ చేస్తుండడం.. గొడవలకు దిగుతుండడం.. గేమ్స్ సరిగా ఆడడం లేదని అందరూ టార్గెట్ చేయడం వంటి కారణాలతో అభిజీత్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ కారణంతోనే అతడికి మద్దతు బాగా పెరిగిపోయింది. తద్వారా నామినేషన్స్‌లో ఉన్న 11 సార్లు సేఫ్ అయ్యాడు. అంతేకాదు, ప్రేక్షకుల మద్దతుతో నాలుగో సీజన్‌కు విజేతగా నిలిచాడు.

ఫుల్ బిజీగా అభిజీత్.. చర్చలు కూడా

ఫుల్ బిజీగా అభిజీత్.. చర్చలు కూడా

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో విన్నర్‌గా నిలవడంతో అభిజీత్ విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడీ బిగ్ బాస్ విజేత. అంతేకాదు, కొన్ని ప్రాజెక్టుల గురించి చర్చలు కూడా జరుపుతున్నాడు.

టాలీవుడ్ బడా మల్టీస్టారర్‌లో అభిజీత్

టాలీవుడ్ బడా మల్టీస్టారర్‌లో అభిజీత్

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అభిజీత్‌కు ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ‘భీష్మ' డైరెక్టర్ వెంకీ కుడుములతో అతడు తాజాగా సమావేశం అయ్యాడు. దీంతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అభిజీత్ ఓ భారీ మల్టీస్టారర్‌లో భాగం కాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది.

ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సందడి

ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి సందడి

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రం ‘F3'. గత ఏడాది భారీ హిట్ అయిన ‘F2'కి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో అభిజీత్ కీలక పాత్రను పోషించబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ అంటే పడిచచ్చిపోయే అనిల్.. అతడి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే ఓ రోల్ క్రియేట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Salaar Auditions కి హాజరైన 5000 పైగా యువత..!! | Prabhas | Prashant Neel | Salaar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X