Bigg Boss Telugu 5: రేసులో TV9 యాంకర్ ప్రత్యూష.. మరో టాప్ జర్నలిస్టు.. ఇంకా ఎవరెవరంటే!

తెలుగు టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించిన నాలుగు షోలు విజయవంతంగా పూర్తయిన తర్వాత 5వ సీజన్‌కు బిగ్‌బాస్ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. జూన్‌లో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో కోవిడ్19 పరిస్థితుల కారణంగా ఈ షో ప్రారంభానికి ఆలస్యమైందని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌కు అంతా రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 5కి ఏర్పాట్లు షురూ..

బిగ్‌బాస్ తెలుగు 5కి ఏర్పాట్లు షురూ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌కు సన్నాహక కార్యక్రమాలు మొదలైనట్టు సమాచారం. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది.

మంచి క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు 4

మంచి క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు 4

గతేడాది కరోనావైరస్ సమయంలో కూడా బిగ్‌బాస్‌ తెలుగు 4 సీజన్‌కు మంచి ఆదరణ లభించింది. అత్యధిక టీఆర్సీ, ఓట్లు రావడంతో నిర్వాహకులకు మరింత ఉత్సాహం లభించింది. గత సీజన్‌లో సినీ నటుడు అభిజిత్ టైటిల్‌ను గెలుచుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీల ఎంపికపై మరింతగా దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.

టీవీ 9 యాంకర్ ప్రత్యూష పేరు..

టీవీ 9 యాంకర్ ప్రత్యూష పేరు..

బిగ్‌బాస్ ఎంపిక రేసులో టీవీ9 యాంకర్ ప్రత్యూష దూసుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. యాంకర్ ప్రత్యూష స్క్రీన్ ప్రజెన్స్, సమయస్పూర్తి, విద్యార్హతలు, మాట తీరు బిగ్‌బాస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందనే విషయాన్ని నిర్వాహకులు భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

వర్షిణి సౌందర్యరాజన్, టీవీ 5 మూర్తి

వర్షిణి సౌందర్యరాజన్, టీవీ 5 మూర్తి

ఇంకా తెలుగు బుల్లితెరలో విశేషంగా రాణిస్తున్న యాంకర్ రవి, వర్షిణి సౌందర్యరాజన్, టీవీ5 మూర్తి తదితరుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయని తెలుస్తున్నది. అలాగే యూట్యూబ్‌లో యాంకర్లుగా రాణిస్తున్న శివ, స్రవంతి ప్రశాంత్ వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. వీరిలో కొందరు ఫైనల్ లిస్టులో ఉండే అవకాశం లేకపోలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.

Recommended Video

Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
జూలైలో బిగ్‌బాస్ సీజన్ 5

జూలైలో బిగ్‌బాస్ సీజన్ 5

టెలివిజన్ రంగానికి కాకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న స్టార్లు, ఇంకా సినిమా పరిశ్రమలోని కొందరు ఆర్టిస్టులు, సినిమా హీరోయిన్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తున్నది. అయితే తుది జాబితాను ఫైనల్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడిస్తున్నారు. ఎప్పటిలానే ఈ ప్రక్రియను సీక్రెట్‌గా కొనసాగిస్తుండటం గమనార్హం. అయితే ఈ సీజన్‌ను జూలైలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X