Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి? దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఎంట్రీ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభమై హోరాహోరీగా సాగుతోంది. 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. గత ఎపిసోడ్‌ల అనుభవం నేపథ్యంలో ఈసారి జనానికి బాగా తెలిసినవారిని, సెలబ్రెటీలనే హౌస్‌లోకి పంపడంతో ఈసారి బిగ్‌బాస్‌కు ఓ లుక్ వచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు అగ్నిపరీక్షతో కామనర్స్‌తో కూడా హౌస్‌లోకి వచ్చి సెలబ్రెటీలకు చెమటలు పట్టిస్తున్నారు. అయితే ఈసారి కూడా బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీరే
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో సెలబ్రెటీ కేటగిరీలో రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, తనూజ పుట్టస్వామి, రాము రాథోడ్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మలు వచ్చారు. ఇక అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌లోకి ఆరుగురు సామాన్యులు అర్హత సాధించారు. దమ్మ శ్రీజ, మర్యాద మనీష్, హరిత హరీష్, పవన్ కళ్యాణ్ పగడాల, పవన్ డిమోన్, ప్రియా శెట్టిలు కామనర్స్ కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టారు. అప్పుడే తొలి వారంలో నామినేషన్స్ ఘట్టం ముగిసి గొడవలు జరుగుతున్నాయి.

హోరాహోరీగా నామినేషన్స్
సోమవారం హౌస్ ప్రశాంతంగా, గేమ్ అర్ధం చేసుకోవడానికి అవకాశం కల్పించిన బిగ్‌బాస్ మంగళవారం నుంచి నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. తొలి వారం మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో సంజనా గల్రానీ, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రష్టీ వర్మ, ఇమ్మాన్యుయేల్, తనూజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమోన్ పవన్‌లు ఉన్నారు. వీరిలో ఒకరు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ కానున్నారు. బిగ్‌బాస్ తెలుగు 8లో మిడ్ సీజన్ మధ్యలో పలువురు సెలబ్రెటీలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి పంపారు. వారంతా తమ మైండ్ గేమ్, ఆటతీరుతో పాటు కామెడీతో ఎంటర్‌టైన్ చేశారు. ఇదే వ్యూహాన్ని తాజా సీజన్‌లోనూ అమలు చేయాలని భావిస్తున్నారు బిగ్‌బాస్.
ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ
ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్‌లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బుల్లితెర నటి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈవిడకు అలా పిలుపొస్తే చాలు.. ఇలా హౌస్‌లో కాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో వినిపిస్తున్న తర్వాతి పేరు దివ్యెల మాధురి. తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ గురించి తెలియని వారు లేరు. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలైనా ఖచ్చితంగా ఈమె హౌస్‌లో అడుగుపెడతారని వార్తలు వస్తుంటాయి.
మాధురితో శ్రీనివాస్ రిలేషన్
వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా తొలుత జనానికి పరిచయమయ్యారు మాధురి. శ్రీనివాస్‌కు ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారు. అయితే మాధురితో ఆయన రిలేషన్, వీరి కుటుంబ తగాదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దివ్వెల మాధురికి కూడా పెళ్లయి.. భర్త, పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ పాపులరైన ఈమెకు శ్రీనివాస్ ఓ ఫంక్షన్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన మాధురి.. ఆయనకు బాగా దగ్గరై వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి.. శ్రీనివాస్‌కు భార్య వాణితో గొడవల మొదలయ్యాయి. ఆ తర్వాత వివాదం పెద్దది కావడంతో మాధురి, శ్రీనివాస్‌లు వేరుగా సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది ఏపీ ఎన్నికల్లో శ్రీనివాస్ ఓటమి పాలవ్వగా.. దివ్వెల మాధురిని ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ దండలు మార్చుకున్న ఫోటోలు వైరల్ కావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.
నా రాజాకు దూరంగా ఉండలేను
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 9లో దివ్వెల మాధురి కంటెస్టెంట్‌గా అడుగుపెడతారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ నుంచి తమకు ఆఫర్ వచ్చినమాట వాస్తవమేనని మాధురి, శ్రీనివాస్‌లు తెలిపారు. తాను అన్ని రోజులు నా రాజాకి దూరంగా ఉండలేనని, అందుకే బిగ్‌బాస్ తెలుగు 9 ఆఫర్ రిజెక్ట్ చేశానని మాధురి వెల్లడించారు. అయితే కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీగానైనా మాధురిని హౌస్‌లో అడుగుపెట్టించాలని బిగ్‌బాస్ నిర్వాహకులు పట్టుబడుతున్నారట. దీనికి ఈ జంట సానుకూలంగా స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే దివ్వెల మాధురి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినట్లే. ఒకవేళ రాజాకు దూరంగా ఉండలేనని ఆమె పట్టుబడితే శ్రీనివాస్‌ను కూడా వెంట తీసుకొస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











